పాకిస్తాన్ ఇండియా రెండు కలిసి పోతే చూడాలని ఇరు దేశాల నేతలు మరియు ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎంతైనా వారు మన దాయాదులు కదా.. కొన్ని వందల ఏళ్ళు పాటు అన్న దమ్ముల్లాగా అక్కచెల్లెలు మాదిరిగా కలిసి ఉన్నారు. దేశ విభజన అనే ఘోర తప్పిదం వల్ల రెండు దేశాల స్నేహం దెబ్బ తిన్నది. ఇప్పటికీ రావణ కాష్ట మాదిరిగా గొడవలు సాగుతున్నాయి. ఒక సారి పాకిస్తాన్ చరిత్రను పరిశీలిస్తే భారత్ తో స్నేహ భావాలూ కష్టమేమో అనిపించక తప్పదు. 

Image result for india and pakistan

హిందూస్తాన్‌లో అయితే బతకలేం అంటూ అక్కడకు వెళ్లి వాళ్లు బావుకుంటున్నదేమీ లేదని తెలుసు. అనేక విషయాల్లో వాళ్ల బతుకు అధ్వాన్నంగా ఉంది. 70 ఏళ్లగా ప్రజాస్వామ్యం ఉన్న మన దేశమే యిలా అఘోరించగా, మాటిమాటికి సైన్యం పాలనలో జోక్యం చేసుకుంటూ ఉంటే అక్కడ యింకెలా ఉంటుంది? అక్కడి పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇండియాను, ఇండియన్సును దోషులుగా చూపిస్తారు. మన దగ్గరా కొందరు ఆ ప్రయత్నంలో ఉంటారు. నిజానికి మనం యిక్కడ పాకిస్తాన్‌ వాళ్లపై ప్రయోగించడానికి కత్తులు నూరుతూ కూర్చోలేదు, మన ఏడుపుల్లో మనం ఉన్నాం. అక్కడ పాకిస్తానీలు అంతే. విదేశాల్లో తారసిల్లితే సగటు పాకిస్తానీ మనలాటి వాడే అనే సంగతి అర్థమవుతుంది. వాడికీ అదే అర్థమవుతుంది. కానీ పాలకులు ఎంతసేపూ విషప్రచారం చేస్తూ ఉంటే వాళ్లు అయోమయంలో పడతారు. 

Image result for india and pakistan ఫ్లాగ్స్

కొందరు ఇండియా-పాక్‌ స్నేహం వర్ధిల్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అఖండ్‌ భారత్‌ నినాదాలిచ్చేవాళ్లు పాకిస్తాన్‌, ఇండియా కలిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. కలిసిపోక పోయినా స్నేహంగా ఉంటే డిఫెన్సు మీద పెట్టే బోల్డు ఖర్చు ఆదా అవుతుంది. కానీ అగ్రరాజ్యాలు అలా కానీయవు. మన మధ్య నిప్పు రాజేస్తూ యిద్దరికీ ఆయుధాలు అమ్ముకుంటూ లాభపడుతూంటాయి. ఇలాటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌ పాలకులు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు, ఎవరు ఇండియాకు సన్నిహితులు, ఎవరు కారు అని వివరంగా తెలుసుకోవడం మనకు  బోరుగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఇండియాకు అనుకూలంగా ఉండి, సైన్యంపై ఖర్చు తగ్గిద్దామని అనుకోగానే సైన్యం వాళ్లని దింపేయడానికో, అప్రతిష్ఠపాలు చేయడానికో శతథా ప్రయత్నిస్తుంది. ఇక వాళ్లు కూడా ఇండియా మీద అవాకులు, చెవాకులు మాట్లాడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: