ఈ రోజులలో ఫర్లాంగు దూరం నడవడమే కష్టమైపోతోంది. ఆధునిక జీవన శైలి అలా చేసేసింది. ఇక పెద్ద వాళ్ళు, సంపన్నుల విషయానికి వస్తే ఇంట్లో కూడా తిరిగేందుకు బ్యాటరీ కార్లను వాడేస్తున్న కాలమిది. మరి ఈ టైంలో ఓ అద్భుతమే జరుగుతోంది. ఇది గతంలో లేనిది, మళ్ళీ జరుగుతుందో లేదో తెలియనిది. ఇంత పెద్ద ఎత్తున ఓ యాగమే సాగుతోంది. అలుపెరగని తీరుతో,  మొక్కవోని దీక్షతో నిరంతరంగా వేస్తున్న  అడుగులు తరతరాలు గుర్తుంచుకునే మైలు రాళ్ళు.


జగన్ ఓ మ్యాజిక్ :


వైఎస్ జగన్ ఓ మ్యాజిక్. ఆయన అద్భుతాలే స్రుష్టిస్తున్నాడు. పదేళ్ళుగా రోడ్లను పట్టుకునే తిరిగాడు. రాజకీయాల్లో ఇంతలా జనంతో మమేకం అయిన నేత ఇప్పటి తరంలో ఎవరూ లేరు. ఆయన దశాబ్ద రాజకీయం ఓ సాహసం. అనితర సాధ్యం. ఎన్ని పోరాటాలు, ఎన్ని దీక్షలు, ఎన్ని యాత్రలు, వాటన్నిటినీ తలదన్నేలా  సుదీర్ఘ పాదయాత్ర.  ఇది చరిత్రలో నిలిచేదే మరి. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర అని మొదట ప్రకటించారు. కానీ ఇంకా రెండు జిల్లాలు మిగిలి ఉండగానే జగన్ మూడు వేల కిలోమీటర్ల ఫీట్ ని అధిగమించారు. 


విజయానికి తీపి గురుతు :


ఈ రోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం, దేశపార్త్రునిపాలెం గ్రామంలో జగన్ మూడు వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటుతారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక పాదయాత్రకు గుర్తుగా ఫైలాన్ జగన్ ప్రారంభిస్తారు.  పార్టీ నాయకులు అంతా హాజరవుతున్న ఈ ప్రొగ్రాం ని పండుగలా చేసేందుకు వైసీపీ నిర్ణయించింది. మొత్తానికి జగన్ జననేతగా మొదటి విజయం సాధించారు.



మరి రేపటి రోజున ఆ ఫలాలు, ఫలితాలు సానుకూలంగానే ఉంటాయని వైసీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. జనం వైసీపీ వైపు తిప్పేలా జగన్ పాదయాత్ర బాగా ఉపయోగపడిందని అంటున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగినా గెలించేందుకు మేము రెడీ అని వైసీపీ ఇపుడు ధీమాగా చెబుతోందంటే అది పాదయాత్రికుని విజయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: