అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే దారుణ హత్యకు గురి అయ్యాడంటేనే అది ఎంతగా శాంతి భద్రతలు దిగజారారాయో చెప్పకనే చెబుతోంది. మావోయిస్టుల ప్రాబల్యం లేదని అంతా బాగానే ఉందని నిర్లస్ఖంగా పోలీసులు ఉంటున్నారు. మరో వైపు వారిని గైడ్ చేయాల్సిన పోలీసు మంత్రి గారు సైతం నామ మాత్రంగానే ఉంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 


శాంతి.. భద్రత ఉందా : 


ఏపీ విషయానికి వస్తే శాంతి భద్రతలు బాగా అడుగంటాయనడానికి విశాఖ మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోల చేతుల్లో దారుణ హత్యకు గురి కావడాన్ని చెప్పుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా  సంచలనం రేపుతోంది. సమర్ధుడైన సీఎం ఉన్న ఏపీలోనే ఇలా జరిగితే ఇతర వెనకబడిన రాష్ట్రాల సంగతేంటో ఊహించుకోవచ్చు. ఇదిలా ఉండగా   ఎక్కడా లేని విధంగా పోలీసులు ఏకంగా ఓ అధికార పార్టీ ఎంపీ మీదనే నోరు చేసుకుంటారు. నాలుక తెగ్గొస్తామని  మీసం తిప్పుతారు.
ఇక ఆ ఎంపీ గారు కూడా ఏమీ తక్కువ తినలేదు. పోలీసులను రోడ్డు మీదకు వచ్చి నానా దుర్భాషలూ ఆడతారు. ఇలా వీధి పోరాటాలు జరుగుతున్నా  హోం శాఖ మంత్రి, ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తారు


ఎంతటి నిర్లక్ష్యం :


విశాఖ మన్యంలో  ఓ వైపు మావోలకు సంబంధిచి 14వ వారోత్స‌వాలు జరుగుతున్నాయి. 21 నుంచి 27 వరకూ ఇవి జ‌రుగుతున్నాయి. రెండేళ్ళ క్రితం వరకూ అయితే పోలీసుకు ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకునే వారు. మన్యం అణువణువూ జల్లెడ పట్టేవారు . ప్రజా ప్రతినిధులను అలెర్ట్ చేసేవారు. మరి కొంతకాలంగా మావోల బలం ఏమీ లేదని డిసైడ్ అయ్యారో ఏమో కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా అరకు ఎమ్మెల్యే పైన మావోల టార్గెట్ ఉందని కూడా పోలీసులకు తెలుసు.
ఆయన మారు మూల గ్రామాలకు వెళ్తూంటే ముందు వద్దని వారించాలి, లేకపోతే భద్రత అయినా ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే రెండూ జరగలేదు. దాంతోనే ఇంతటి దారుణం జరిగిపోయింది.


వైఫ‌ల్యం కానే కాదట :


ఇంత జరిగాక హోం మంత్రి చినరాజప్ప ఇది పోలీస్ వైఫల్యం కాదని అంటున్నారు. మావోల వారోత్సవాలపై ఇంఫర్మేషన్ ఉందని, అప్రమత్తం చేశామని చెబుతున్నారు. అదే జరిగితే మరి కిడారిను ఎందుకు వెళ్ళనిచ్చినట్లు. ఇక ఏపీవ్యాప్తంగా శాంతి భద్రతలు బాగా ఉన్నాయని, అంతా అదుపులో ఉందని చినర‌జప్ప చెబుతున్న మాటలు సెల్ఫ్ డిఫెన్స్ కోసమేనన్నది అర్ధమవుతోంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య పట్ల చంద్రబాబు సైతం తీవ్రంగా పరిగణించారంటేనే హోం శాఖ నిర్వాకం ఎలా ఉందో అర్ధమైపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: