ఓ వైపు విశాఖ జిల్లాలో వైసీపీ అధినేత జగన్ జోరుగా పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు ఇదే జిల్లా ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు దారుణంగా చంపేశారు. దీంతో ఉలిక్కిపడ్డ పోలీలుసు అలెర్ట్ అయ్యారు. మన్యంతో సహా అంతటా గాలింపు ముమ్మరంగా జరుగుతోంది. కీలక నాయకులకు భద్రత కూడా పెంచుతున్నారు.


అంతటా అలెర్ట్ :


వైఎస్ జగన్ ఈ రోజు నుంచి విజయనగరం జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఇక్కడ కూడా మావోల ప్రాబల్యం అధికంగా ఉంది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే జిల్లాలోని  సాలూరులో గ్రామ దర్శిని సభకు వెళ్దామని ప్లాన్ చేసారు. చివరి నిముషంలో అది రద్దు అయింది. మావోల తాకిది ఎక్కువగా ఉన్నా ప్రాంతం కావడం వల్లనే సీఎం టూర్ క్యాన్సిల్ చేసారు. 


జగన్ కి భద్రత :


ఇపుడు అదే జిల్లాలో జగన్ ప్రవేశించారు. దాంతో పోలీసులు జగన్ కి భద్రత బాగా పెంచనున్నారని భోగట్టా.  పైగా జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ని కూడా   అడిగి తీసుకున్న పోలీసులు అడగడుగునా భద్రత కల్పించాలని నిర్ణయించారు. జగన్ రాత్రి వేళ బస చేసే ప్రాంతం వద్ద కూడా భద్రతను మరింత పెంచనున్నట్లు పోలీసు వర్గాలు తెలియచేశాయి. మొత్తం మీద చూసుకుంటే మావోల లేటెస్ట్ అటాక్ తో ఏపీ అంతటా అలజడి రేగుతోంది. సున్నితమైన ప్రాంతాలలో నిఘా బాగా పెరిగింది. మావోల టార్గెట్ లో ఉన్న నాయకులకు సైతం భద్రత పెంచాలని పోలీసులు  డిసైడ్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: