తెలుగు రాష్ట్రాలో సంచలనం సృష్టంచిన ప్రణయ్ పరువు హత్య అందరికీ తెలిసిందే.   కేవలం తమకన్నా తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందన్న కక్ష్య తో అమృత తండ్రి మారుతీరావ్ తన అల్లుడుని అత్యంత దారుణంగా నరికి చంపించిన విషయం తెలిసిందే.  మొదట ఇది కుటుంబ కలహంగానే అభివర్ణించినా..తర్వాత పరువు హత్యగా మారడంతో రెండు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది.  ప్రేమిస్తే..చంపేస్తారా అంటూ రాజకీయ, సినీ వర్గాల నుంచి కూడా తీవ్ర విమర్శలు రావడం మొదలయ్యాయి. మొన్నటి వరకు ప్రణయ్ హత్యపై నినసనలు తెలిపిసన వారు..ఇప్పుడు ఆయన విగ్రహ ఏర్పాటుకు సబబు కాదని అంటున్నారు.  పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై మిర్యాలగూడలో కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.తల్లిదండ్రుల సంఘం పేరుతో వీరు మిర్యాలగూడలోని మినీ రవీంద్ర భారతి వద్ద సమావేశం జరిపారు. 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కర్నాటి ప్రభాకర్, న్యాయవాది చిలుకూరి శ్యామ్ మాట్లాడుతూ, ప్రణయ్ హత్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇది రెండు కుటుంబాలకు చెందిన సమస్య అని... దీన్ని కులాలకు సంబంధించిన సమస్యగా మార్చి, సమాజంలోని అందరికీ ఆపాదించడం సరికాదని అన్నారు.  ప్రణయ్‌ విగ్రహాన్ని ఆయనకు చెందిన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చని, అంతే తప్ప పబ్లిక్ ప్రదేశం లో వద్దని వారు అన్నారు. దీనిపై డిఎస్పికి వారు ఒక వినతిపత్రం కూడా ఇచ్చారు.

ప్రణయ్ విగ్రహాన్ని పెడితే, నగరంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, కులాల మధ్య చిచ్చు రేగుతుందని వారు చెప్పినట్టు సమాచారం. కాగా, మిర్యాలగూడ సెంటర్ లో తన భర్త విగ్రహాన్ని పెట్టేందుకు పోరాటం చేస్తానని అమృత వెల్లడించిన సంగతి తెలిసిందే.   ప్రణయ్‌ విగ్రహాన్ని  ఏర్పాటు చేస్తే..భవిష్యత్తు తరాలకు చెడు సందేశం వెళ్లడంతోపాటు ప్రజల మధ్య మరింత అంతరాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

వీరంతా ర్యాలీగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ, పురపాలిక అధికారులు ఫిర్యాదు చేసినందున దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం వారు ర్యాలీగా పురపాలిక కార్యాలయం వద్దకు వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: