ఎన్నికల సీజన్లో రాజకీయం భలే జోరు మీద ఉంది. ఓ వైపు పాత కాపులంతా టికెట్ రేసులో ఉంటే సందట్లో సడేమియా అన్నట్లుగా సినిమా నటులు సైతం సై అంటున్నారు. నిన్నటికి నిన్న స్టార్ కమేడియన్ ఆలీ జనసేనానితో నెల్లూరు టూర్లో  కనిపించి రాజకీయాల్లొకి  వచ్చేస్తున్నంటూ సంకేతాలు పంపారు. ఇపుడు మరో నటుడి వంతు. ఆయన కూడా రాజకీయాలంటూ కలవరిస్తున్నారట.


సైకిలెక్కనున్నారా :


తెలుగు సినిమా పరిశ్రమలో సుమన్ ది ప్రత్యేకమైన శైలి. ఆయన హీరోగా అనేక విజయవంతమైన సినిమాలు చేస్తూ అభిమానం చూరగొన్నారు. ఆ తరువాత ఇపుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బాగానే రాణిస్తున్నారు. సుమన్ టీడీపీకి బాగా క్లోజ్ అన్న సంగతి విధితమే. ఆయన వీలు చిక్కినపుడల్లా బాబు పాలన భేష్ అంటూ కితాబులు ఇస్తున్నారు. ఇక బాలయ్యతోనొ మంచి దోస్తీ ఉంది. దాంతో ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని టాక్


అక్కడ నుంచి :


ఆయన తాను పోటీ చేసే అసెంబ్లీ సీటును కూడా చూసుకున్నారని భోగట్టా. గుంటూరు జిల్లా రెపల్లె నుంచి సుమన్ పోటీకి రెడీ అంటున్నారు. ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ రంగంలో ఉన్నారు. ఆయనతో పోటీ పడి గత ఎన్నికల్లో గెలిచిన సత్యప్రసాద్ గౌడ్ పై వ్యతిరేకత ఉండడంతో బెస్ట్ చాయిస్ కోసం టీడీపీ సెర్చ్ చేస్తోందట. మరి ఆ టికెట్ సుమన్ కి ఇస్తారని అనుకుంటున్నారు. సినిమా హీరోగా సక్సెస్ చూసిన సుమన్ రాజకీయాల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా... చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: