నాగార్జున రెండోవ కుమారుడు అఖిల్ మొదటి సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది దీనితో చాలా గ్యాప్ తరువాత హలో తీస్తే అది కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే అఖిల్ కెరీర్ ను తను తీర్చిదిద్దలేకపోయాననే విషయాన్ని నాగార్జున పరోక్షంగా అంగీకరించాడు. ప్రారంభంలో అఖిల్ కొన్ని తప్పులు చేశాడని, ఇకపై అలాంటివి రిపీట్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు నాగార్జున. అఖిల్ బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ నాగ్ ఈ కామెంట్స్ చేశాడు.

Image result for akhil and nagarjuna

"కరణ్ జోహార్ కు అఖిల్ అంటే బాగా ఇష్టం. అఖిల్ ను బాలీవుడ్ కు పరిచయం చేస్తానని 2-3 సార్లు అడిగాడు. నేనే ఆగమని చెప్పాను. వాడు కుర్రాడు అప్పుడే తొందరేముందని ఆపాను. ఆల్రెడీ అఖిల్ ఓసారి తొందరపడి తప్పుచేశాడు. అఖిల్ పెద్దోళ్ల మాటలు వింటే బాగుంటుంది." అఖిల్ కు బాలీవుడ్ ఆఫర్ ఎప్పుడూ రెడీగా ఉంటుందని, పూర్తిస్థాయిలో నటనకు సంబంధించి మెళకువలు నేర్చుకున్న తర్వాత బాలీవుడ్ కు వెళ్తాడని స్పష్టత ఇచ్చాడు నాగ్. టాలీవుడ్ లో ఓ మంచి బ్రేక్ వచ్చిన తర్వాత బాలీవుడ్ కు వెళ్తే బాగుంటుందని సూచించాడు.

అఖిల్ తొందరపడి తప్పు చేశాడు

"అఖిల్ కు రెండేళ్ల కిందటే కరణ్ జోహార్ ఆఫర్ ఇచ్చాడు. అఖిల్, కరణ్ ఎప్పుడూ టచ్ లో ఉంటారు. మంచి సినిమా చేద్దామని వాళ్లిద్దరూ ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటారు. కాకపోతే అప్పుడే వద్దని నేనే చెప్పాను. తెలుగులో ప్రూవ్ చేసుకున్న తర్వాత బాలీవుడ్ కు వెళ్తాడు. నేను శివ సినిమా టైమ్ లో అదే చేశాను. మంచిగా అన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు హిందీలో చేస్తే బాగుంటుంది. అని చెప్పాడు నాగార్జున .


మరింత సమాచారం తెలుసుకోండి: