ఆంధ్రాలో రైతులను కష్టాల్లో ముంచి అమెరికా వెళ్ళి వ్యవసాయం గురించి ఏం చెబుతావు బాబూ అంటూ జగన్ సెటైర్లు వేశారు. రైతులను ఇక్కడ నట్టేట ముంచింది నేనేనని ధైర్యం ఉంటే చెప్పాలని బాబుకు  సవాల్ చేశారు. రైతన్నలపై హామీల వరద పారించి సీఎం సీటు పట్టేసిన బాబు అమెరికాలో కధలు చెప్పడానికి వెళ్ళారని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 


రైతులు చితికిపోయారుగా :


బాబు హయాం వస్తే చాలు రైతులు ఎపుడూ చితికిపోతూనే ఉంటారని జగన్ అన్నారు. కొత్తవలస‌లో ఈ రోజు జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ చేస్తాన్న పెద్దమనిషి తన రాజకీయ పబ్బం గడుపుకుని మరచిపోయారని అన్నరు. నాబార్డ్ ప్రకటించిన డేటాలో ఏపీలో రైతుల పరిస్తితి 29వ ర్యాంక్ కు దిగజారిందని అన్నారు. ఈ విషయాలు అమెరికా మీటింగులో దమ్ముంటే చెప్పాలని డిమాండ్ చేసారు.


విస్తీర్ణం పడిపోయింది :


వైఎస్ జమానాలో 71 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంటే బాబు జమానాలో ఏపీలో 59 లక్షల హెక్టార్లకు దిగజారిపోయిందని జగన్ అటాక్ చేశారు. బాబు వస్తే వానలు, వ్యవసయమూ, బాబు చేసే ప్రభుత్వ సాయమూఅ అన్నీ గోవిందానే అని సెటైర్లు వేశారు. బాబు నిజాయతిగా ఈ విషయలు అమెరికా మీటింగులో  చెప్పగలరా అని నిలదీశారు.


మోసానికి ఓటా :


వంచన, మోసం, దగా చేసే టీడీపీకి ఓటు వేయొద్దని జగన్ పిలుపు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాకుండా కేంద్రం వద్ద బాబు తాకట్టు పెట్టరని, ఫలితంగా పరిశ్రమలు లేవని, యువతకు జాబులూ రాలేదని అన్నారు. లక్షన్నరకు పైగా ఉద్యోగాల  ఖాలీలు ఉంటే బాబు ఒక్క పోస్టూ ఇంతవరకూ భర్తీ చేయలేదని, నిరుద్యోగ భ్రుతి పేరు చెప్పి ఓట్లు తీసుకుని  మోసం  చేశారని ఫైర్ అయ్యారు. బాబు పాలన పోతేనే  ఏపీ బాగుపడుతుందని జగన్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: