చంద్ర బాబు నాయుడు అమెరికా లో కూడా టీడీపీ పార్టీ గురించి ఆ పార్టీ ని గెలిపించమని అక్కడ కూడా ఎన్నికల స్టంట్ మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అంటున్నారు. ఆ చారిత్రక అవసరాన్ని గుర్తెరిగి రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెడితే, చంద్రబాబు ఏం చేశారు.? రాజధాని పేరుని అమరావతిగా ప్రకటించారు తప్ప, ఆ అమరావతి నిర్మాణంలో 'వేగం' చూపించలేకపోయారు.

Image result for chandrababu naidu

చంద్రబాబు హైటెక్‌ ఆలోచనలు, డిజైన్లకే పరిమితమయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్‌ పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నట్టు, చంద్రబాబు తన పుత్రరత్నం నారా లోకేష్‌ని మంత్రిగా చూసుకున్నారండోయ్‌.. ఈ నాలుగున్నరేళ్ళలో చంద్రబాబు సాధించిన ఘనతల్లో ఇదే ప్రముఖమైనది. సొంతింట్లో బావమరిదికి ఎమ్మెల్యే పదవినిచ్చిన, కొడుక్కి మంత్రి పదవినిచ్చి.. చంద్రబాబు తన కుటుంబాన్ని చాలానే అభివృద్ధి చేసుకున్నారు.

అమెరికాలో టీడీపీ.. అదిరిందయ్యా చంద్రం

ఇంకోసారి అధికారమిస్తే, కుటుంబ సభ్యుల్లో మిగిలినవారికీ పదవుల్ని పంచేస్తారేమో. బహుశా దాన్నే చంద్రబాబు, 'చారిత్రక అవసరం' అనుకుంటున్నారని మనం అనుకోవాలి. ప్రపంచ స్థాయిలో స్వర్గీయ ఎన్టీఆర్‌కీ, చంద్రబాబుకి మాత్రమే.. గుర్తింపు వుందన్నది తెలుగు తమ్ముళ్ళ ఉవాచ. అమెరికా టూర్‌లో చంద్రబాబు మాటలు కూడా ఇలాగే వుంటున్నాయ్‌. పోన్లెండి, స్వర్గీయ ఎన్టీఆర్‌ పేరుని కూడా చేర్చారు.. తనతోపాటు, తన పుత్రరత్నం నారాలోకేష్‌ పేరు మాత్రమే చెప్పుకుని చంద్రబాబు మురిసిపోలేదు విదేశీ వేదికలపైన. విదేశాల్లో వివిధ రాజకీయ పార్టీలకు 'అభిమాన సంఘాలు' వున్నాయి. అవి ఇప్పటికే రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాటిల్లో ప్రచార కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడూ చూస్తూనే వున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: