జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరు లో పర్యటించిన సంగతీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసినాడు. అయితే రాజకీయ పార్టీ అయినా ఆరంభంలో వ్యక్తి ప్రేమ మూలంగానే ప్రజల్ని ఆకర్షిస్తుంది. తర్వాతి కాలంలో ఆ వ్యక్తి ప్రేమ పార్టీ ప్రేమగా మారినప్పుడే పార్టీ కొన్ని దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో మనగలుగుతుంది. ఇది వాస్తవిక దృష్టి ఉన్న ఏ నాయకుడికైనా తెలిసిన అక్షర సత్యం. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కూడ ఇదే సత్యాన్ని బలంగా నమ్ముతున్నారు.


జనసేన ఆవిర్భావానికి, ఆనతి కాలంలోనే అది ఇంత మంచి రూపాన్ని సంతరించుకోవటానికి ప్రధాన కారణం పవన్ ఛరీష్మానే. అభిమానులు, యువకులు, లోకల్ లీడర్లు, మేధావులు, మహిళలు ఇలా అందరూ పవన్ మీద ప్రేమతో, ఆయన ఆలోచనా సరళి నచ్చి జనసేనకు జై కొట్టారు, కొడుతున్నారు. ప్రస్తుతం ప్రజలంతా తనపై చూపిస్తున్న ఈ ప్రేమను, నమ్మకాన్ని భవిష్యత్తులో పార్టీపై ప్రేమగా, నమ్మకంగా మార్చే పని మొదలుపెట్టారు పవన్.

Image result for pavan jansena

నిన్న నెల్లూరులో అభిమానులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ ప్రసంగం మధ్యలో తనపై ప్రేమతో పార్టీలోకి రావొద్దని, పార్టీపై నమ్మకంతో రండని అనడమే ఇందుకు నిదర్సనం. ఈ పద్దతిని పవన్ మరింత విస్తృతంగా కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆరంభంలో ఆయన అన్నట్టు ఇంకో పాతిక ముప్పై ఏళ్ల పాటు జనసేన పనిచేయాలనే ఆయన కల నెరవేరినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: