ఏపీలో ఇపుడు జగన్ పాదయాత్ర భారీ ఎత్తున జరుగుతోంది. మీడియాలో ఓ సెక్షన్ కవరేజికి దూరంగా ఉన్నా కూడా జనాభిప్రాయం మాత్రం అందరికీ అందుతోంది. ఇడుపులపాయ నుంచి గత ఏడాది నవంబర్ 6న జగన్ వేసిన మొదటి అడుగు ఇప్పటికి మూడు వేల కిలోమీటర్లు మైలు రాయిని దాటింది. ఇది నిజంగా అరుదైన ఘటనే. చెప్పాలంటే రికార్డే. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఒకే తీరున జగన్ కి జనం బ్రహ్మరధం పట్టారు, పడుతున్నారు. 


దేనికి సూచిక :


జగన్ కోసం జనం వస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా వింటున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో మీటింగ్ పెడితే జన ప్రవాహం అక్కడ ఉప్పొంగింది. అంతకు ముందు లేని విధంగా జనం పోటెత్తారు. మరి జగన్ తో పాటే అడుగులో అడుగు వేస్తున్నారు. ఇది జనంలో ఉన్న అభిమానానికి కొలమానంగా చూడవచ్చా అంటే తల పండిన రాజకీయ పండితులు మాత్రం చూడాల్సిందే అంటున్నారు. ఈ జనం జగన్ పక్షమేనని కూడా డిసైడ్ చేస్తున్నారు.


సునామీయేనా :


జగన్ వెంట నడుస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స  సత్యనారాయణ మాటల్లో చెప్పాలంటే జగన్ ఓ ప్రభంజనం స్రుష్టిస్తారట. ఇది ష్యూర్ అంటున్నారు బొత్స. అప్పట్లో అన్న నందమూరి,ఆ తరువాత వైఎస్ క్రియేట్ చేసిన రికార్డులని బ్రేక్ చేస్తారని బొత్స ధీమాగా చెబుతున్నారు. ఇక్కడో మాట ఆయన అన్నారు. నేను వైసీపీ మనిషిగా చెప్పడం లేదు. జనం అభిప్రాయాన్ని బాగా దగ్గర ఉండి చూస్తున్నాను. అందువల్లనే గట్టిగా చెప్పగలను అని అంటున్నారు.


మరో పది శాతం :


జగన్ కాబోయే ముఖ్యమంత్రి అని ఈ మధ్య వచ్చిన ఇండీయాటుడే సర్వేలో 43 శాతం ఓటింగ్ ఇచ్చారు. అయితే జగన్ పాదయాత్ర ముగిసే లోపు ఇది మరో పది శాతం అంటే 53 శాతానికి చేరుకుంటుందని వైసీపీకి చెందిన మరో  నాయకుడు మహమ్మద్ ఇక్బాల్  బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో జగన్ పేరు మారుమోగుతోందని, రాబోయే రోజుల్లో అది మరింతగా పెరిగి జగన్ ని ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన అంటున్నారు.


అసంత్రుప్తికి ఏక రూపమా :


పార్టీ నాయకుల మాటలు ఎలా ఉన్నా జగన్ కి జనం మాత్రం వెల్లువలా వస్తున్నారు. ఏపీ జనల్లో తెలియని అసంత్రుప్తి మాత్రం ఉంది. బాబు పాలన పట్ల గూడు కట్టుకున్న వ్యతిరేకత ఏకరూపంగా తీసుకుంటే మాత్రం అంతా చెబుతున్నట్లుగా జగన్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఏడాదిగా జనంతో నడుస్తూ వారి ఆలొచనలు పంచుకుంటున్న జగన్ లో ఆత్మ విశ్వాసం ఇంతలా పెరగడానికి జనం గుండె చప్పుడు వినడమే అసలు కారణం కాబోలు.


మరింత సమాచారం తెలుసుకోండి: