భగత్ సింగ్.. మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచు కుంటాయి. 23 ఏళ్ల వయసులోనే... దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి... ఉరికొయ్యను ముద్దాడాడు.  దేశం కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఉరికంబమెక్కిన భగత్ సింగ్ వర్ధంతి నేడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. భారత విప్లవోధ్యమ నిర్మాత, భారతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ ఉరికంబన్ని ముద్దాడి దేశానికి ఆదర్శంగా నిలిచారు.


మనిషిని వేరొక మనిషి దోపిడి చేయనటువంటి రాజ్యం రావాలని నవ సమాజం కోసం ఎదురు చూసిన మహనీయుడు. అమెరికా సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు భగత్ సింగ్. లాహోర్ జైలులో 114రోజులు దీక్షచేసి ఖైదీల డిమాండ్లను పరిష్కరించి రాజకీయ ఖైదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలితరం విప్లవ వీరుడిగా పేరుగాంచిన భగత్ సింగ్ ను 1931, మార్చి 23న ఆనాటి తెల్లదొరలు ఉరితీశారు. ఈరోజు దేశం కన్నీరు పెట్టిన రోజు. చరిత్ర మరిచిపోని రోజే ఇదే. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల నినాదం ప్రపంచమంత వినిపించింది. భగత్ సింగ్ త్యాగం వసంత మేఘం లాంటిది. భారత దేశానికి ఆయన ఆదర్శంగా నిలిచారు.


పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ లోని సాందా గ్రామంలో సెప్టెంబర్ 7న, 1907సంవత్సరంలో జన్మించిన భగత్ సింగ్ చిన్న వయస్సులోనే దేశభక్తిని అలవర్చకున్నారు. కరడుగట్టిన దేశభక్తుడిగా ముద్రపడ్డారు. 1929లో అమెరికా సామ్రాజ్యవాదుల కళ్లుతెరిపించాలని, భారతజాతి గొంతువినిపించాలని పార్లమెంటుపై బాంబులు విసిరి నిరసన తెలిపారు. ఒకచేతితో బాంబు, మరో చేతిలో కరపత్రాలు విసిరి అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, విప్లవం వర్ధిల్లాలని నినదించారు. వేలమంది ప్రాణాలుతీసిన జనరల్ డయ్యార్ పై ఎలాంటి కేసు పెట్టలేదని, విచారణ కూడా చేయలేదని ప్రశ్నించారు. దేశం కోసం ఉరికొయ్యలు, చెరసాలలు లెక్కచేయకుండా దేశం కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయిన భగత్ సింగ్ ను స్మరించుకోవడం మన కర్తవ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: