భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించాడు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యా వతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. అలాగే హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. అతని ప్రభావం భగత్ పై బాగా ఉండేది.  బ్రిటీష్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు..కన్నీళ్లు ఆ చిన్న హృదయాన్ని కదిలించాయి.  పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్ పై విపరీత ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్ర్య పోరాటంలో మొదటిసారి పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టాడు. 


భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్‌ను తీసుకొని తన స్నేహితుడు నందకిశోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి " ఏం చేస్తున్నావ్ నాన్నా" అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు. భగత్ సింగ్ అన్న మాటలివి " తుపాకులు నాటుతున్నా". భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి, దేశభక్తికి మచ్చుతునక. 


గాంధీ చేపట్టిన అహింసా ఉద్యమం వల్లే కాకుండా, హింస్తాత్మక ఉద్యమంతో కూడా బ్రిటిష్ వారి ఆగడాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉండేవాడు. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ దురంతం అతనిలో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది.  కాలేజ్ లో చదువుతున్న భగత్ సింగ్ కి కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలనుకున్నారు.  అప్పుడు భగత్ ఓ ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయాడు. ఆ ఉత్తరంలో ‘నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను...నాకు ఇంకే కోరిక లేదు’ అని రాశాడు. ఇంటి నుంచి పారిపోయి నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు. ఆ సంఘం ద్వారా యువకులను ఆకర్షించి స్వాతంత్ర్యోద్యమ సాధనకు పురికొల్పాడు.


అనంతరం హిందూస్తాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. అక్కడే అతనికి సుఖ్ దేవ్ పరిచయమయ్యాడు. ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు. బ్రిటీష్ సైనిక దళాలు లాలా లజపతిరాయ్  అన్యాయంగా కొట్టి చంపారు..దాంతో  భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులలో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్లతోనే సాండర్స్ అంతు చూశారు. కసితీరా కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది.  బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ హత్యా నేరం మోపిింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ లు నేరాన్ని ఒప్పుకున్నారు... కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: