భగత్ సింగ్ ఈ పేరు తలచుకోగానే ఏదో తెలియని ఆవేశం వస్తుంది. కొత్త ఉత్తేజమూ ఉదయిస్తుంది. ఏదైనా సాధించగలమన్న నమ్మకమూ  ఆ క్షణంలోనే కలుగుతుంది. పిరికివాడైనా ఆ పేరు మహిమతో ధైర్యంగా కదిలే శక్తి వస్తుంది. భారత దేశానికి సంబంధించి భగత్ సింగ్ ని ఎర్ర సూరీడుగా పిలుచుకోవాలి. భారతీయ మార్క్స్ గా కూడా అభివర్ణించాలి


ఆశయమే ఊపిరిగా :


భగత్ సింగ్ కారణజన్ముడు. ఎందుకోసమైతే పుట్టాడో ఆ లక్ష్యాన్ని సాధించే వరకూ పోరాడాడు. అందులోనే ప్రాణాలు వదిలాడు. కేవలం 23 ఏళ్ళ వయసులో ఈ దేశం కోసం, స్వేచ్చా స్వాతంత్రాల కోసం తన ప్రాణాలను త్రుణ సమానంగా వదిలేశాడు. నాటి ఆంగ్లేయులకు వెన్నులో వణుకు పుట్టించాడు. భాతీయుల గుండెల్లో నిండా దేశ భక్తిని దట్టించాడు.


విప్లవం వర్ధిల్లాలి :


ఈ మాటలు అన్నది తొలిసారిగా భగత్ సింగ్. ఈ దేశానికి ఈ వాక్యాలను  పరిచయం చేయడమే కాడు. బ్రిటిష్ దొరల చెవుల్లో రణ నినాదంలా మారుమోగేలా చేశాడు. ఐరోపా విప్లవ ఉద్యమాలను స్పూర్తిగా తీసుకున్న భగత్ సింగ్ తానూ దేశం కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అనేక విప్లవ సంస్థల్లో చేరి బానిస పాలన పోవాలంటూ గర్జించాడు.


అలా ముందుకు :


హిందుస్థాన్  గణతంత్ర సంఘం లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా మార్చి పోరట వీరుడిగా ఎదిగాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును  కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు భగత్ సింగ్ ని  ఉరితీశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: