అనుకున్న దానికోసం ఎంతవరకినా వెళ్ళడం వీరుడి లక్షణం. అదే అతని చేత చరిత్ర స్రుష్టిస్తుంది. చరిత్రలో నిలిచిపోయేలా చేస్తుంది. భగత్ సింగ్ అలాంటి వాడే. గొప్ప సాహసి. విప్ల‌వాన్ని, వీరులను అణచివేయలన్న కసితో నాటి బ్రిటిష్ పాలకులు ఓ దుర్మార్గమైన చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టం చేసిన అసెంబ్లీ మీదనే బాంబు వేసి మరీ భగత్ సింగ్ తెల్ల దొరలను గడగడలాడించాడు.


నిరసన కోసమే :


నిజానికి భగత్ సింగ్ వేసిన బాబు అంత ప్రమదకరమైనది కాదు, భరత మాత దాస్య శ్రుంఖలాలు  తొలగించడం కోసం తాము పాటుపడుతూంటే తమ మీద విషపు చట్టాలను ప్రయోగించడం పట్ల నిరసన తెలియచేయడానికే భగత్ సింగ్ ఈ చర్యకు పూనుకున్నాడు. అది ఏప్రిల్ 8వ తారీకు 1929వ సంవస్తరం. భగత్ సింగ్, దత్ అనే మరో దోస్త్ తో కలసి అసెంబ్లీపై బాంబు వేశారు. ఆ సమయంలో భగత్ సింగ్ 
ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ పెద్దగా నినాదాన్ని చేశాడు. అదే బ్రిటిష్ పాలకులకు సమర నినాదమైంది.


తనువు మనసూ దేశమే :


ఇలా అన్ని విధాలుగా బ్రిటిష్ వారిని ఎదిరించి పట్టుబడిన భగత్ సింగ్  ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాత కూడా నిబ్బరంగా  జైలులో గడిపాడు. కటకటాలలో ఉండి కూడా దేశం కోసమే ఆలోచనలు చేశాడు. భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా ఖైదీ జీవితాని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు.
చివరికి ఉరి వేసి కంఠానికి బిగించిన సమయంలో కూడా ఆయన నోట వచ్చిన మాట విప్లవం వర్ధిల్లాలి. ఈ దేశం అంతటి గొప్ప దేశ భక్తున్ని కన్నది. చరిత్రలో ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరంగానే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: