Image result for katrina hot comments on rahul gandhi
రాహుల్ గాంధి అంత హాటా! ఈ హాట్ హాట్ కత్రినా కైఫ్ కి?  

2011 లో అనుకుంటా ఒకసారి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఆమె మీద కాస్త కటువుగానే ఆగ్రహం ప్రదర్శించింది. తను హాఫ్ ఇండియన్  గతంలో చెప్పిన కత్రినా, అనాడు తనను తాను రాహుల్ గాంధితో పోల్చుకుంది. రాహుల్ గాంధీ కూడా హాఫ్ ఇండియన్ అన్నట్టుగా మాట్లాడింది. 

Image result for katrina hot comments on rahul gandhi

ఇంగ్లిష్ యాక్ట్రెస్ అయిన ఈ భామ హిందీ సినిమాలలో నటిస్తూ, బాలీవుడ్ లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకొనే తారగా మారింది. హాంగ్ కాంగ్ లో జన్మించిన ఈ భామ అనేక దేశాలు తిరిగి తొలుత లండన్ లో స్థిరపడింది. ఆపై ఈ బ్రిటీష్ ఇండియన్ నటి విదేశాల నుంచి తిరిగి తిరిగి వచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
Image result for katrina kaif on rahul gandhi
ఆమెపై ఎన్నో విమర్శలు, హావ భావాలు నటన అంతా బాగా రావని సోషల్ మీడియాలో ఆడిపోసుకున్నారు. కొందరు సహ హీరోయిన్లు అయితే అసూయతో  కత్రినా కైఫ్ ను హాఫ్-ఇండియన్  అంటూ తీవ్ర విమర్శలు చేసినా ఆమె హైబ్రిడ్ భామ (తల్లి హాంగ్-కాంగ్ మహిళ - తండ్రి బ్రిటీష్ వ్యాపారి అయినా కాశ్మీరి ఇండియన్)  అని జరిగిన ప్రచారం ఆ ఎంటర్టెయిన్మెంట్ రంగం కాబట్టి ఆమెకు మంచి ఫెచ్చింగ్ తెచ్చింది. 


దీనికి కౌంటర్ గా తనను రాహుల్ గాంధీ తో పోల్చుకొని కత్రినా దిమ్మదిరిగే కామెంట్లు చేసింది. రాహుల్ గాంధీ కూడా హాఫ్ ఇండియనే అని నోరుజారింది. ఈ వివాదం ఎంత పెద్దది అయ్యిందో తెలిసిందే. కాంగ్రెస్ నాయకులంతా కత్రినా కైఫ్ పై దుమ్మెత్తి పోశారు. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో! అని వార్నింగ్ లు ఇచ్చారు. ఇలా తనను తాను రక్షించుకోవడం కోసం రాహుల్ గాంధీని బలి చేసిన కత్రినా కైఫ్ తాజాగా రాహుల్ గాంధిని పొగిడేసింది.

Image result for hottest rahul gandhi
ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కత్రినా, ‘మీ దృష్టిలో హాటెస్ట్ రాజకీయ నేత ఎవరు?’ అంటే ఇద్దరి పేర్లను ప్రస్తావించింది. వారిలో ఒకరు అమెరికన్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాగా.. రెండో వ్యక్తి రాహుల్ గాంధీ అని వెల్లడించింది. వీళ్లిద్దరూ హాటెస్ట్ పొలిటీషియన్ అని కత్రినా కుండబద్దలు కొట్టింది.  ఇలా ఓసారి నోరు జారి, ఇప్పుడు పొగిడి రాహుల్ పై తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుంది ఈ హాట్ హీరోయిన్.
Image result for hottest katrina

మొత్తానికి రాహుల్ గాంధీ జన సామాన్యాన్ని ఏ మేరకు ఆకట్టుకున్నాడో కానీ, హాట్ హీరోయిన్ చేత మాత్రం హాట్ హాట్ హాట్ అనిపించుకుంటున్నాడు. రాజకీయాల గురించి చెప్పండంటే మాత్రం తనకు పెద్దగా అందులో అవగాహన లేదని కత్రినా చెప్పిందట. 

Image result for katrina hot comments on rahul gandhi

మరింత సమాచారం తెలుసుకోండి: