జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత ప్రజా పోరాట యాత్ర స్టార్ట్ చేసేసారు. గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటన చేసిన పవన్ కళ్యాణ్..పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టి కొన్ని నియోజకవర్గాలలో పర్యటించడం జరిగింది. అయితే కంటే శాస్త్ర చికిత్స నిమిత్తం కొన్నాళ్లు యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్. తాజాగా తాను ఓటరు కార్డు నమోదు చేయించుకున్న ఏలూరు నియోజకవర్గంలో రెండో విడత యాత్ర స్టార్ట్ చేశారు.

Image result for chinthamaneni

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సంచలన కామెంట్ చేశారు.  ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ రౌడీషీటర్ మాదిరి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.చింతమనేని రాజరికంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళిత తేజం నిర్వహించిన చంద్రబాబు నాయుడు దళిత సమస్యలను మాత్రం తీర్చలేకపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు.

Image result for chintamaneni vs pawan kalyan

దివ్యాంగుల సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తన పోటో పెట్టుకున్న ఆటోలవారిని కొందరు వేదిస్తున్నారని తెలిసిందని ఆయన అన్నారు. తాను గెలుపుకోసం రాజకీయాలలోకి రాలేదని, మార్పు కోసం వచ్చానని సామాన్యుల తరఫున వారి సమస్యల తరపున ప్రశ్నించడం కోసం రాజకీయాలలోకి వచ్చానని అన్నారు పవన్. ఈ క్రమంలో ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ దెందులూరు నియోజకవర్గంలో పదవ వార్డులో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి రెడీ అయిపోయారు.

Image result for chintamaneni vs pawan kalyan

ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయం పవన్ వర్సెస్ చింతమనేని అన్నట్టుగా.. నువ్వా నేనా అన్నట్టుగా వాతావరణం నెలకొంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏలూరు నగరంలో అడుగుపెట్టడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు..భారీగా ఫ్లెక్సీలు పెట్టి ఏలూరు నగరాన్ని ముస్తాబు చేశారు..అంతేకాకుండా బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఐదు రోజుల పాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించడానికి కార్యక్రమాలు రూపొందించి ఉన్నట్లు పార్టీవర్గాల నుండి వస్తున్న సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: