త‌న చేతికి వాచ్ లేదు..జేబులో ఒక్క రూపాయి కూడా లేదు....ఇది త‌ర‌చూ చంద్ర‌బాబునాయుడు చెప్పే బీద మాట‌లు. నిజానికి పార్టీ అధ్య‌క్షుడి హోదాలో ఉన్న వారికి లేదా ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్యక్తికి  జేబులో రూపాయితో ఏం ప‌ని ? అంత చిన్న విష‌యం చంద్ర‌బాబుకు తెలీదా ? అయినా ఎందుకు ప‌దే ప‌దే చెబుతుంటారంటే తాను ఎంత‌టి నిజాయితీపరుడో అని జ‌నాలు అనుకోవాల‌న్న‌ది ఆయ‌న తాప‌త్ర‌యం.  చంద్ర‌బాబు గురించి తెలిసిన‌వారికి ఆయ‌న చ‌రిత్ర కూడా తెలిసే ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. 


ఇదంతా ఇపుడెందుకంటే ?  నిప్పు  నారా చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ఆస్తులు అక్ష‌రాల రూ. 1200 కోట్ల‌ట‌. ఈ విష‌య ఎవ‌రో ప్ర‌తిప‌క్షం వాళ్ళు చెప్పిన మాట కాదు సుమా ?  ప్ర‌పంచంలోని అత్యంత సంప‌న్నుల గురించి ప్ర‌తీ సంవ‌త్స‌రం లెక్క‌లు తీసి జాబితాను ప్ర‌చురించే బార్ క్లేస్ హూరున్ ఇండియాలో అత్యంత ధ‌నికుల జాబితాను విడుద‌ల  చేసింది. దేశంలో వెయ్యి కోట్ల‌కంటే పైగా ఆస్తులున్న వారి జాబితాను బ‌ర్ క్లేస్ సంస్ధ త‌యారు చేసింది. దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారు చాలా మందే ఉన్నారు లేండి.


కానీ అదే జాబితాలో ఏపికి సంబంధించి ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌లు కూడా ఉన్నారు. వారిలో అత్య‌ధికులు మెడిక‌ల్ ఫీల్డ్ కు సంబంధించిన వారే ఉన్నారు. అటువంటి వారి జాబితాలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి  నారా భువ‌నేశ్వ‌రికి కూడా చోటు ద‌క్క‌టం విశేషం. తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 50 మంది ఉంటే అందులో హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారుగా  రూ. 1200 కోట్ల‌తో భువ‌నేశ్వ‌రి కూడా చోటు ద‌క్కించుకున్నారు.  భువ‌నేశ్వ‌రి సంప‌ద  వెయ్యి కోట్లు దాటిని త‌ర్వాత చంద్ర‌బాబుకు జేబులో రూపాయెందుకు ?  వాచీ లేదు..జేబులో రూపాయి కూడా లేద‌నే బీద మాట‌లెందుకు ? 


మరింత సమాచారం తెలుసుకోండి: