చంద్ర‌బాబునాయుడుకు ముంద‌స్తు షాక్ త‌ప్పేట్లు లేదా ? ఇపుడీ అంశంపైనే రాష్ట్రంలో జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. న‌వంబ‌ర్ లోక్ స‌భ‌ను ర‌ద్దు చేయ‌టం ద్వారా చంద్ర‌బాబుకు పెద్ద షాకివ్వాల‌ని ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి ప్లాన్ చేస్తున్న‌ట్లు బిజెపి వ‌ర్గాలంటూ పెద్ద ప్ర‌చార‌మే మొద‌లైంది. జ‌రుగుతున్న ప్రచారం గ‌నుక నిజమై న‌వంబ‌ర్ లోనే లోక్ స‌భ ర‌ద్దైతే   జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రిలోనే పార్లమెంటుకు ముంద‌స్తు  ఎన్నిక‌లు త‌ప్ప‌వేమొ అనే అనిపిస్తోంది. అదే జ‌రిగితే  ఏపిలో అసెంబ్లీ కూడా ర‌ద్ద‌య్యే అవ‌కాశాలున్నాయి. 


షెడ్యూల్ ప్ర‌కారం ఏపిలో అసెంబ్లీ ఎన్నిక‌లకు మే 15 వర‌కు గ‌డువుంది.  గ‌డువుకు ముందే అంటే ఆరుమాసాల ముందు ఎప్పుడైనా స‌రే అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌లు జ‌ర‌ప‌టానికి ఎన్నిక‌ల క‌మీష‌న్ కు పూర్తి అధికార‌ముంది.  ఆ లెక్క‌న డిసెంబ‌ర్ 15 త‌ర్వాత  అసెంబ్లీ ర‌ద్దు చేసే అధికారం ఇసికి ఉన్న‌ట్లే. ఒక‌వైపు లోక్ స‌భ ర‌ద్దైతే రెండు మాసాల్లోగా ఎన్నిక‌లు జ‌ర‌ప‌టానికి ఇసి చ‌ర్య‌లు తీసుకుంటుంది.  అంటే ఏ జన‌వ‌రిలోనో  లోక్ స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని అనుకోవ‌చ్చు. 


జ‌న‌వ‌రిలో లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని అనుకుంటే మే లో జ‌ర‌పాల్సిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటే క‌లిపి జ‌రిపేందుకే అవ‌కాశాలున్నాయంటూ బిజెపి వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే ఏపిలో షెడ్యూల్ ప్ర‌కారం మే లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు ఓ ఐదు మాసాల ముందే జ‌రిగేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌బ‌డుతున్నాయి. ఇప్ప‌టికే ముంద‌స్తు ఎన్నిక‌ల కోస‌మ‌ని కెసిఆర్ తెలంగాణాలో అసెంబ్లీని ర‌ద్దు చేసుకున్న విష‌యం  అంద‌రికీ తెలిసిందే. అంటే ఇటు కెసిఆర్ అటు మోడి ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ఒకే విధంగా వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు అర్ధ‌మ‌వుతోంది.


కార‌ణాలేవైనా జ‌మిలి ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాన‌మంత్రి బాగా దృష్టి పెట్టారు. అయితే, చాలా రాజ‌కీయ పార్టీలు వ్య‌తిరేకించాయి.  ఏ నిర్ణ‌యం తీసుకోవాలో అర్ధం కాకుండా ఒక‌వైపు ప్ర‌ధాని మీమాంశ‌లో ఉండ‌గానే రాఫెల్ యుద్ద‌విమానాల కొనుగోలు వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. దాంతో ప్ర‌తిప‌క్షాల‌న్నీ బిజెపి, మోడిపై బాణాలు ఎక్కు పెట్ట‌టంతో  రాజ‌కీయం ఒక్క‌సారిగా  వెడెక్కింది.  దాంతో ఈ అంశం మ‌రింత ముద‌ర‌క ముందే జ‌నాల్లో అనుమానాలు  పెరిగిపోక‌ముందే  ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళిపోతే స‌రిపోతుంద‌ని మోడి  స‌న్నిహితులు స‌ల‌హా ఇచ్చార‌ని స‌మాచారం.


జ‌మిలి ఎన్నిక‌లు ఎటూ కుద‌ర‌ద‌ని తేలిపోయిన నేప‌ధ్యంలో క‌నీసం లోక్ స‌భ‌క‌న్నా ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌ప‌టం, షెడ్యూల్ కు ద‌గ్గ‌ర‌లో ఉన్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా ఒకేసారి జ‌రిపేస్తే స‌రిపోతుంద‌ని మోడి ఆలోచిస్తున్నార‌ట‌. అదే నిజ‌మైతే చంద్ర‌బాబు ఆలోచ‌న‌తో సంబంధం లేకుండానే ఏపి అసెంబ్లీ కూడా బ‌హుశా న‌వంబ‌ర్లోనో డిసెంబ్లోనో ర‌ద్దైపోవ‌చ్చు.  అప్పుడు చంద్ర‌బాబు ఏం  చేస్తారో చూడాలి ?


మరింత సమాచారం తెలుసుకోండి: