పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజా క్షేత్రం లోకి వచ్చాడు అయితే ఇప్పుడు 2019 ఎన్నికలు దగ్గర పడుతుండటం తో అన్ని పార్టీలు మేనిఫెస్టో ను మీద కసరత్తు చేస్తున్నాయి అయితే జనసేన అధినేత హామీలు వింటే ఆశ్చర్యం రాక మానదు. తాజాగా దివ్యాంగులకు ఒక్కొకరికి 10వేల రూపాయలు పింఛన్ ఇచ్చేస్తామంటూ హామీ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. ఏలూరులో వికలాంగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్, చిన్నప్పటి నుంచి తాను వికలాంగుల కష్టాలను చూసి చలించిపోయేవాడినని అందుకే 20 ఏళ్ల వయసులోనే వారి కష్టాలపై ఓ డాక్యుమెంటరీ తీశానని సెలవిచ్చారు. ఇప్పుడా డాక్యమెంటరీ ఏమైంది, ఎవరు తీశారు అనే ప్రశ్న వేసేవారు లేరు కాబట్టి సరిపోయింది.

పవన్ హామీలు.. షాక్ అవుతున్న ప్రజలు

అంతటితో ఆగలేదు పవన్. రిజర్వేషన్లు, ప్రత్యేక కార్పొరేషన్, హాస్టళ్లు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, హెల్త్ కార్డులు.. ఇలా వరాల జల్లు కురిపిస్తూ పోయారు. ఆ తర్వాత పింఛన్ విషయం వచ్చింది. సామాజిక పింఛన్ 5వేలకు పెంచాలని వికలాంగులు కోరగా.. జనసేన అధికారంలోకి వస్తే 10వేలకు పైగా పింఛన్ ఇస్తామని భరోసా ఇచ్చాడు. అది కూడా తక్కువేనంటూ ముక్తాయించాడు.

Image result for pavan jansena latest

హామీల విషయంలో పవన్ కల్యాణ్ ఏ వర్గాన్నీ వదిలిపెట్టడం లేదు. తమ డిమాండ్లు వినిపించడానికి వెళ్లినవారు కూడా విస్తుపోయేలా ఆయన హామీలుంటున్నాయి. వెయ్యి రూపాయలు పెంచండి సారూ అంటే పదివేలు ఇస్తా పో అంటారు. పప్పు, ఉప్పులిప్పించండి బాబయ్యా అంటే.. సబ్బులు, షాంపూలు కూడా ఫ్రీగా ఇచ్చేస్తా పో అని వరాలిస్తారు. రేషన్ బదులు నేరుగా ఎకౌంట్లో డబ్బులే వేస్తామంటున్నారు. మేనిఫెస్టో తయారీ ముందువరకు సాధ్యాసాధ్యాలు చూసుకొని హామీలిస్తానన్న పవన్, ఇప్పుడు కనివినీ ఎరుగని రీతిలో, సాధ్యపడుతుందా లేదా అనే ఆలోచన లేకుండా హామీలు గుప్పిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడూ ఇవ్వని, ఇవ్వడానికి సాహసించని హామీలన్నీ జనసేనాని నోటవెంట వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: