ఆధార్ సంఖ్య విశిష్టం - రాజ్యాంగబద్ధం - దేశ ప్రజలకు సర్వ సమానంగా అట్టడుగు వర్గాలతో సహా సర్వుల కు సాధికార గుర్తింపుకు నిస్తుంది అని స్పష్టీకరించిన సుప్రీం కోర్ట్.  భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆధార్ 12 అంకెల ఆధార్ గుర్తింపు సంఖ్యపై ఇవాళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆధార్‌ సంఖ్యకు రాజ్యాంగం బద్ధత ఉందని స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాదాపు 139 నోటిఫికేషన్లు విడుదల చేసింది. 2016 లో ఆధార్ చట్టం అమల్లోకి రాక ముందే దీనిపై సుప్రీంకోర్టు లో సవాళ్ల మీద సవాళ్ళు దాఖలయ్యాయి.

Image result for aadhar card supreme court judgement

ఇందులో మాజీ హైకోర్టు జడ్జి కేఎస్ పుట్టస్వామి సహా 31మంది ఆధార్‌ పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నెలల్లో దాదాపు 38రోజుల పాటు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మే 10న తీర్పును రిజర్వ్‌ లో ఉంచి నేడు సంచలన తీర్పు వెలువరించింది.

 Image result for aadhar card supreme court judgement

తీర్పు ప్రకారం:

*యూనిక్ ఇడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా విడుదల చెసే ఈ ఆధార్ నంబర్ ఉన్న కార్డ్ "ఒక భారత పౌరుని బయోమెట్రిక్ - డెమోగ్రాఫిక్ డేటా ఆధారం గా విడిదల చేస్తే అధికారాన్ని కలిగి ఉంది. ఇది ఒక బహుముఖ వరసల (లేయర్డ్) రక్షణ భద్రతను అందులోని డేటాకు ఇస్తుంది.

 

*అధార్ కార్డ్ కు నకిలీ కార్డులను సృష్టించలేము. కారణం ఇది విశిష్టమైనదని ఎందుకంటామంటే వీటిలో వ్యక్తుల బయోమెట్రిక్ సమాచారం నిప్షిప్తమై ఉంటుంది. బయోమెట్రిక్ సమాచారం ఉన్నచోట నకిలీలకు ఆస్కారం ఉండదు.

 

*ఆధార్‌ కార్డ్ నంబరుతో సమాజంలోని అట్టడుగు వర్గా ప్రజలకు వ్యక్తిగత గుర్తింపు లభించిందని దేశ సర్వోన్నత న్యాయస్థానం - సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ ఆధార్ కార్డు వలన వ్యక్తికి లేదా కలిగి ఉన్నవారికి సాధికారితను అందించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి స్పష్టం చేశారు.

 Image result for aadhar card supreme court judgement

*ఆధార్ కార్డు రాజ్యాంగ బద్దమైనదని ఆయన స్పష్టీకరించారు.

*బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదు. 

*మొబైల్‌ కనెక్షన్లకు ఆధార్ అవసరం లేదు.

*పాఠశాలలలో అడ్మిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ తదితర పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఆధార్‌ తప్పని సరి కాదు.

*ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేయడానికి, పాన్‌ కార్డు నమోదు చేసుకోవడానికి ఆధార్‌ కార్డు తప్పకుండా ఉండాలి.

*ఆధార్ డేటా భద్రత పై ఎలాంటి అనుమానాలు అవసరంలేదు - ఇది పూర్తి సురక్షితం.

 Image result for aadhar card supreme court judgement

*అధార్ విశిషిష్టం అట్టడుగు వర్గాల సాధికారత కోసం ఆధార్ కీలక పాత్ర పోషిస్తోందనీ, వారికి ఓ గుర్తింపు కల్పిస్తోందని, ఇతర కార్డుల మాదిరిగా దీన్ని డూప్లికేట్ చేయడం కుదరదని గుర్తుచేసింది. ఇటీవల సంవత్సరాల్లో ఆధార్‌ పై విస్తృత చర్చ జరిగిందని, ఆధార్‌‌ కార్డు ఉన్నతమైనది అనేకంటే విశిష్టమైనది అనడం అత్యంత సమంజసంగా ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ వ్యాఖ్యానించారు. డేటా భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పటిష్టమైన డేటా భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది.

 

*అయితే ఆధార్ కార్డుకు, గుర్తింపునకు తేడా ఉందనీ, ఒక్కసారి ప్రజల నుంచి బయో-మెట్రిక్ డేటా సేకరిస్తే అది సిస్టమ్‌ లో స్టోర్ అయి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ కార్డు కోసం ప్రభుత్వం కేవలం కొన్ని ప్రాధమికమైన వివరాలను మాత్రమే సేకరిస్తుందనీ, ఒకరికి కేటాయించిన ఆధార్ సంఖ్య మరెవరికీ ఉండదని అందుకే ఇది విశిష్టమైనదని సుప్రీం పేర్కొంది.

 Image result for aadhar card supreme court judgement

ఆధార్‌ కార్డ్ తో వ్యక్తిగత గోప్యత కు  భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై  బుధవారం నాడు కోర్టు  విచారణ జరిపింది.ఈ పిటిషన్లపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ ఏకే సిక్రి తీర్పును చదివి విన్పించారు.

 

కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. సుమారు బిలియన్‌ మంది కి పైగా భారతీయులు ఆధార్‌ నమోదు చేసుకున్నారని న్యాయస్థానం ఈ సందర్భంగా తెలియజేసింది.

Image result for aadhar card supreme court judgement

ఆధార్సంక్షిప్తంగా  దేనికి అవసరం

* పాన్‌ కార్డుకు

* ఆదాయపన్ను రిటర్నులు ఫైల్‌ చేయడానికి

* ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు

ఆధార్సంక్షిప్తంగా  దేనికి అవసరం లేదు

* బ్యాంకు ఖాతాలకు
* టెలికాం సేవలకు, మొబైల్‌ నంబరు తో అనుసంధానానికి
* సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు
* స్కూల్‌ అడ్మిషన్లకు
*ప్రైవేట్ వ్యక్తులకు, వ్యవస్థలకు

Image result for aadhar card supreme court judgement

మరింత సమాచారం తెలుసుకోండి: