జగన్ అంటే చంద్ర బాబు కు ఎంత భయమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి చెప్పాడు. నిజానికి 2014 ఎన్నికలో చంద్ర బాబు గెలుస్తాడని అతను కూడా ఉహించలేదంట.. జగన్ సీఎం అవుతాడని అనుకున్నాడంటా.. ఇంకా పవన్ ఏమన్నాడంటే  2014లో ఎన్నికలు పూర్తయిన కొన్ని రోజులకు, కౌంటింగ్ కంటే ముందు ఓసారి చంద్రబాబు, లోకేష్ నన్ను భోజనానికి పిలిచారు. ఆ రోజున గెలుస్తాననే నమ్మకం చంద్రబాబుకు లేదు.

జగన్ అంటే బాబుకు పిచ్చ భయం

పదవి దక్కుతుందని ఆయన ఊహించలేదు. ఆయన నాకు భోజనం పెట్టి ఒకటే అడిగారు. పవన్ గారూ, ఒకవేళ ఓడిపోతే మనిద్దరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ అంటే చంద్రబాబుకు అంత భయం." పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అధికారంలోకి వస్తానని బాబు అస్సలు ఊహించలేదని, జగన్ ముఖ్యమంత్రి అయిపోతారని, వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆఖరి నిమిషం వరకు చంద్రబాబులో భయం ఉండేదని చెప్పుకొచ్చారు పవన్. అలాంటి టైమ్ లో జగన్ హవా నుంచి చంద్రబాబును తను రక్షించానని చెప్పుకొచ్చారు.

Image result for chandrababu

"జగన్ నుంచి చంద్రబాబును రక్షించింది జనసేన. ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబును అప్పట్లో రక్షించింది కేవలం జనసేన పార్టీ, జన సైనికులు మాత్రమే. బాబుకు అప్పట్లో అండగా నిలబడింది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, నేను." తెలుగుదేశం పార్టీ అవినీతిమయమైందనే విషయం తనకు ఎన్నికలకు ముందే తెలుసన్నారు పవన్. కాకపోతే అప్పటి పరిస్థితుల వల్ల టీడీపీకే మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అవినీతి వందల రెట్లు పెరిగిపోయిందని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: