ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగుతాయన్న ప్రచారం జోరందుకుంది. కేంద్రంలోని మోడీ సర్కార్ లోక్ సభను రద్దు చేస్తూ పనిలో పనిగా తనతో పాటే ఆంధ్రప్రదేశ్ నూ ముందస్తు ఎన్నికలకు తీసుకెళ్తుందన్న ఊహాగానాన నేపధ్యంలో ఏపీ పాలిటిక్స్ వేడెక్కుతోంది. ముందస్తు జరిగితే  ఎవరికి లాభమన్న లెక్కలూ వేస్తున్నారు.


జగన్ కే ప్లస్ :


తెలంగాణాతో పోల్చుకుంటే ఏపీలో పరిస్తితులు చాలా భిన్నం. అక్కడ ముందస్తు అధికార పక్షానికి లాభించే చాన్స్ కనిపిస్తూంటే ఏపీలో మాత్రం వైసీపీ ఆ అవకాశం తీసుకుంటోంది. ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పెద్ద ఎత్తున జనం మద్దతు పొందే వీలుంటుందని పలు సర్వేలు కూడా తేటతెల్లం చేసిన సంగతి విధితమే. అదే టైంలో ఎన్నికలకు ఇంకా ప్రిపేర్ కాని జనసేన వంటి పార్టీలకు కొంత ఇబ్బంది ఏర్పడుతుందంటున్నారు.


కలసివస్తుంది :


జగన్ ఏడాదిగా జనంలో ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా అయన పాదయాత్రకు జనం బ్రహ్మరధం పడుతున్నారు. ప్రభుత్వ తీరును ఆయన ఎండగడుతూ యాంటీ  ఇంకెంబెన్సీని క్రియేట్ చేసి ఉంచారు. ఇపుడు ఎన్నికలు కనుక జరిగితే ఆ వేడిలో జగన్ పార్టీకి  బంపర్ మెజారిటీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపుగా కోట్లాది మంది జనాన్ని  స్వయంగా కలిసి వారికి నేనున్నానంటూ అండగా నిలిచిన జగన్ టాప్ రేసులోకి దూసుకుపోతారని రాజకీయ పండితులు కూడా చెబుతున్నారు.


బాబుకు ఇరకాటమే :


ఎన్నికలు ఎంత ఆలస్యంగా వస్తే టీడీపీకి అంత అడ్వాంటేజ్. ఎందుకంటే  నాలుగున్నరేళ్ళ పాలనలో చెప్పుకోదగిన అభివ్రుధ్ధి లేదు. ప్రత్యేక హోదా అన్నది తీసుకురాలేకపోయారు. పోలవరం అలాగే ఉంది. రాజధాని డిజైన్ల రూపంలోనే కనిపిస్తోంది. ఇపుడు ఉన్నట్లుండి ఎన్నికలు అంటే టీడీపీకి ఇబ్బందిగానే ఉంటుంది. పైగా ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయన్నది కిడారి సర్వేశ్వరరావు హత్య. అనంతపురం జిల్లా సంఘటనలు నిరూపిస్తున్నాయి. పెట్టుబడులు అంటూ దేశాలు పట్టి తిరుగుతున్నా వర్కౌట్ కాలేదు.


సెంటిమెంట్ కూడా :


ముందస్తు టీడీపీకి అచ్చిరాదన్నది గతంలో పలుమార్లు రుజువైంది. సరిగ్గా 2004లో వైఎస్ పాదయాత్ర చేసిన టైంలో బాబు ముందస్తుకు వెళ్ళారు. ఓడిపోయారు. ఇపుడు జగన్ పాదయాత్ర సాగుతోంది. బాబు వద్దనుకున్నా ముందస్తు ఎన్నికలు తోసుకువస్తున్నాయి. చూడబోతే అదే సీన్ రిపేట్ అవుతుందన్న కంగారు టీడీపీలో ఉంది. ఏది ఏమైనా జగన్ కూడా ముందస్తు వస్తాయని ముందే చెప్పారు. అంటే ఆయన ఒక్కరే రెడీగా ఉన్నారనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: