అందరిలోను అదే అనుమానం మొద‌ల‌య్యింది. ఈరోజు ఉద‌యం నుండి టి కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్ళ‌పై ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఉన్న‌తాధికారులు మెరుపు దాడులు చేశారు.   హైద‌రాబాద్ లోని జూబ్లిహిల్స్ నివాసంతో పాటు మ‌హ‌బూబ్ న‌గర్ జిల్లాలోని కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని సొంత ఇంటిపైనే కాకుండా ద‌గ్గ‌రి బంధువుల ఇళ్ళ‌పైన కూడా ఏకకాలంలో దాడులు జ‌ర‌గ‌ట‌మే ఆశ్చ‌ర్యంగా ఉంది.


ఇంత‌కీ ఆ దాడుల వెనుక ఏముంది ? ఇపుడిదే అద‌రిలోను మొద‌లైన ప్ర‌శ్న‌. అంద‌రికీ తెలిసిన విష‌యం ఏమిటంటే రేవంత్ ఓటుకునోటు కేసులో ఏ 1 అన్న సంగ‌తి. ఈ కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ త‌ర్వాత జైలుకు కూడా వెళ్ళి  ప్ర‌స్తుతం బెయిల్ పై బ‌య‌టున్నారు. ఆ కేసులోనే హ‌ఠాత్తుగా ఐటి శాఖ ఉన్న‌తాధికారులేమ‌న్నా దాడులు చేశారా అన్న‌ది ఓ అనుమానం. ఎందుకంటే, పై కేసులో నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ స‌న్ ఓటు కొనుగోలు చేసే ఉద్దేశ్యంతో రూ. 5 కోట్ల‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగాంగా రేవంతే స్వ‌యంగా రూ .50 ల‌క్ష‌లు ఇవ్వ‌టానికి ఎంఎల్ఏ ఇంటికెళ్ళిన‌పుడు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ్డారు. ఆ కేసు ఇంకా విచార‌ణ జ‌రుగుతూనే ఉంది.  


అయితే, తాజాగా మ‌రో విష‌యం కూడా బ‌య‌టప‌డింది. రేవంత్ ఇంటిపై అక‌స్మాత్తుగా దాడుల వెనుక ఓ లాయ‌ర్ హ‌స్త‌ముంద‌ట‌. రేవంత్ బంధువు జ‌య‌ప్ర‌కాశ్ త‌దిత‌రులు కొన్ని డొల్ల కంపెనీల‌ను పెట్టి మ‌నీ ల్యాండ‌రిగ్ కు పాల్ప‌డుతున్న‌ట్లు సిబిఐకి  ఫిర్యాదు చేశార‌ట‌. సాయిమౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ త‌ర‌పున 15 డొల్ల కంపెనీల‌కు రూ. 300 కోట్లు మ‌ళ్ళించార‌ని ఆరోపించార‌ట త‌న ఫిర్యాదులో. ఆ ఫిర్యాదును సిబిఐ ఈడి, ఐటి శాఖ‌ల‌కు రెఫ‌ర్ చేసింద‌ట సిబిఐ. దాని ఫ‌లితంగానే ఈరోజు దాడులని స‌మాచారం. విష‌యం ఏదైనా దాడుల‌పై  క్లారిటీ రావాలంటే త‌నిఖీ బృందాలే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: