అయోధ్య కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఈ రోజు  వెలువరించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. బాబ్రీ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు నిరాకరించిన అపెక్స్‌ కోర్టు 2 : 1 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది. అయోధ్య భూయాజమాన్య హక్కులపై నెల రోజుల్లో విచారణ చేపడతామని వెల్లడించింది. 


ఆ రోజున కీలక విచారణ


ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అక్టోర్‌ 3న కేసును విచారిస్తుందని స్పష్టం చేసింది. ప్రార్థనా స్థలాలకు ఆయా మతాల్లో ప్రత్యేక స్థానముంటుందనీ, అన్ని మతాలు సమానమేనని వెల్లడించింది. మసీదులు ఇస్లాంలో అంతర్భాగమా కాదా అనే అంశంపై కూడా సుప్రీం కోర్టు విచారణ చేస్తుందని తెలిపింది. కాగా, మసీదులు ఇస్లాంలో అంతర్భాగం కాదని 1994లో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించడం గమనార్హం.


తీర్పుతో తేలేనా :


ఇదిలా ఉండగా అయోధ్యపై గత కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి తెర పడుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయోధ్య అన్నది హిందువులకు పరమ పవిత్రం. ఎప్పటికైనా అక్కడ భవ్యమైన రామాలయం నిర్మించాలని రామ భక్తులు భావిస్తున్నారు. మరి ఆ కొరిక నెరవేరేలా తీర్పు వస్తుందా. ఈ సారి విజయదశమి విజయాన్ని తెస్తుందా అంటే అక్టోబర్ 3 వరకూ వేచి చూడాలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: