అదేంటో టీడీపీ నాయకుల విమర్శలకు హద్దూ పద్దూ లేకుండా పోతోంది. ఇంతవరకూ జగన్  అభివృద్దిని అడ్డుకున్నారు, వాళ్ళతో కుమ్మక్కు అయ్యారు, వీళ్ళతో కేసులు పెట్టించారు ఇలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చిన తమ్ముళ్ళు ఇపుడు చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఏకంగా మావోలతోనే చేయి కలిపేశాడంటూ ఘాటైన ఆరోపణలు చేయడంతో విస్తుపోవడం మీడియా వంతైంది.


జగనేనట :


అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమల హత్య వెనుక జగన్ హస్తం ఉందంటూ విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. కిడారి, సోమలు మంచి వాళ్ళని, మైనింగ్ వ్యవహారాల జోలికే వాళ్ళు వెళ్ళడం లేదని వాసుపల్లి చెప్పుకొచ్చారు. పైగా వైఎస్సార్ టైంలోనే కిడారికి మైనింగ్ లైసెన్స్ ఉందని కొత్త పాయింట్ తీసుకొచ్చారు.


ఇదీ కారణంట: 


ఇక మావోయిస్ట్ లు ఎవరిని చంపినా కర పత్రం విడుదల చేస్తారని, ఇపుడు అలాంటిది చేయలేదని వాసుపల్లి అంటున్నారు. జగన్ ఈ హత్యలపై  కనీసం సానుభూతి తెలియచెయలేదని కూడా చెబుతున్నారు. ఈ కారణాలతో జగనే చంపించారని వాసుపల్లి అభియోగం. బాగానే ఉంది కానీ జగన్ ఈ ఇద్దరు మృతిపై ఆ రోజే పత్రిక ప్రకటన‌ చేశారు, పైగా కొత్తవలస మీటింగులో వేలాది జనాల మధ్యన సంతాపమూ తెలియచేశారు. మరి వాసుపల్లి వారి కధ మాత్రం వేరేలా ఉంది. అంటే రాజకీయంగా విమర్శలు చేస్తే టీడీపీ దిగజారిన ప్రతిష్టను పొందవచ్చు అనుకుంటున్నారేమోనని సెటైర్లు పడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: