సరిగ్గా తెలంగాణ లో ఎన్నికల ముందు కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేయడం గమన్హారం. ఎప్పుడో దాదాపు మూడేళ్ళక్రితం ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా తెలంగాణ ఏసీబీకి చిక్కిన విషయం విదితమే. మిత్రుడు వేం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించేందుకోసం, టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కి ఐదుకోట్లు లంచం ఎరచూపారు రేవంత్‌రెడ్డి.

Image result for revanth reddy

ఈ మొత్తం వ్యవహారానికి బ్రీఫింగ్‌ చేసింది టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. అప్పట్లో టీడీపీ ముఖ్యనేతగా వున్నారు రేవంత్‌రెడ్డి. తన చేతులతో 50లక్షలు అడ్వాన్స్‌గా స్టీఫెన్‌సన్‌కి ఇచ్చిన రేవంత్‌రెడ్డి, మిగతా నాలుగున్నర కోట్లు తర్వాత ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిన సంగతే. ఇంతకీ, ఆ నాలుగున్నర కోట్లు ఎలా సేకరించారు.? అన్నదానిపై అప్పటినుంచీ విచారణ జరుగుతూనే వుంది. ఈ మేరకు రేవేంత్‌రెడ్డికి ఇటీవలే ఐటీశాఖ నోటీసులు కూడా జారీచేసింది. ఆ నోటీసులకు రేవంత్‌ స్పందించలేదన్న ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కనపెడితే, రేవంత్‌ సోదరుడి సంస్థలో అవకతవకల నేపథ్యంలోనే ఐటీశాఖ దాడులు జరుగుతున్నాయన్న వాదనలూ లేకపోలేదు.

Image result for revanth reddy

ఐటీదాడులు జరుగుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి, ఆయన ఇంట్లో లేరు. ఏకకాలంలో పలుచోట్ల సోదాలు చేయడంతో ఒక్కసారిగా రేవంత్‌రెడ్డి సన్నిహాతులు షాక్‌కి గురయ్యారు. రేవంత్‌కి మద్దతుగా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, హైద్రాబాద్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. రేవంత్‌పై రాజకీయ కుట్ర జరుగుతోందని వారంతా ఆరోపిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, తనమీద 'దాడులు' జరగబోతున్నాయంటూ ఇటీవలే రేవంత్‌రెడ్డి ప్రకటించేసుకున్నారు. కాంగ్రెస్‌లో తనకు ముఖ్యమైన పదవి రాబోతోందనీ, ఆ పదవి రాగానే తన మీద దాడులు జరుగుతాయని ఆయన చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: