అరకు ఎమ్మెల్యే ను నక్సల్స్ ఘోరంగా చంపడం అందరిని ఒక సారిగా ఉలిక్కి పాటుకి గురి చేసింది. అయితే పార్టీ మారినందుకు ఎంత తీసుకున్నావు? అయినా చాల్లేదా? మళ్లీ మైనింగ్ ఎందుకు?’ వంటి ప్రశ్నలను నక్సల్స్ ఎమ్మెల్యే కిడారిని చంపే ముందు వేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజాకోర్టు పేరుతో కొంతమంది ముందు నక్సల్స్ కిడారిని ప్రశ్నలు అడిగారని.. పార్టీ మారినందుకు ఎంత తీసుకున్నావని అడిగారని ప్రత్యక్ష సాక్షుల కథనంగా ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి కిడారి సమాధానం చెప్పారని కూడా అంటున్నారు.

ప్రలోభమే.. కిడారి ప్రాణం తీసిందా!

గిరిజన కోటాలో మంత్రి పదవిని ఇస్తామని చంద్రబాబు హామీఇచ్చాడని, భారీగా ఆర్థికలబ్ధిని కూడా కలిగించినట్టుగా కిడారి వివరించినట్టుగా సమాచారం. కిడారి సర్వేశ్వరరావు చెప్పిన నంబర్ ను విని ఆశ్చర్యపోయిన మావోలు.. అయినా చాలక మైనింగ్ కు పాల్పడుతున్నావా? అని కూడా ప్రశ్నించినట్టుగా కథనాలు వస్తున్నాయి. మైనింగ్ వ్యాపారంలో హత్యకు గురైన మరో టీడీపీనేత సోమ కూడా భాగస్వామి అని తెలుస్తోంది.

Image result for kidari sarveswara rao

ఈ విషయమై కూడా వారు ఆయనను ప్రశ్నించారని సమాచారం. తనకు పాతిక పర్సెంట్ వాటా ఇచ్చారని, మొత్తం పెట్టుబడి ఎమ్మెల్యేదే అని సోమ మావోలతో అన్నాడట. ఈ ప్రజాకోర్టు అనంతరం.. మీకు బతకడానికి అర్హత లేదంటూ మావోలు హత్యాకాండకు ఒడిగట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు స్థానికవర్గాల నుంచి సమాచారం అందుతోంది. స్థూలంగా చంద్రబాబు వేసిన ప్రలోభాల వల్లే కిడారి ప్రాణం తీసిందని స్పష్టం అవుతోంది. ఫిరాయింపుకు పాల్పడడం వల్ల.. కిడారి కొద్దిరోజుల పాటు అధికారాన్ని అయితే అనుభవించి ఉండవచ్చు కానీ, అంతిమంగా ఇది జరిగింది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్ లేదు.. అని ఇప్పుడు కూడా వాదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: