తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి ఆయన ముఖ్య బంధువులు అనుచరుల ఇళ్ళపై  ఐటీ దాడుల వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. "ఓటుకు నోటు కేసు" లో భాగంగానే ఐటీ దాడులు జరిగినట్లుగా సమాచారం. ₹ 300 కోట్ల రూపాయిలకు పైగా  విదేశీధనం రేవంత్ రెడ్డి మరియు ఆయన అనుయాయుల ఖాతాల్లోకి ప్రవహించినట్లు ఈ నిఘాసంస్థల వద్ద అధారాలున్నట్లు తెలుస్తుంది. 


నాడు నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీవెన్‌ సన్‌ తో రేవంత్ రెడ్డి రాయబారం నడిపిన సమయంలో దొరికిన ₹ 50 లక్షల సొమ్ము ఎక్కడి నుండి వచ్చిందన్న దానిపై తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అయితే ఏసీబీ ఇంతవరకు అందుకు తగిన ఆధారాలను సాధించలేకపోయింది. 
Image result for vote for note
దీనిపై ఏసీబీ, తనకు సాధ్యంగాని విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కు ఫిర్యాదు చేయగా, వారు రేవంత్ రెడ్డి బ్యాంక్ ఖాతాలపై గత ఆరు నెలల నుంచి నిఘా పెట్టి,  ఈ సమయంలో ఆయన బ్యాంక్‌ ఖాతా ల్లో జరిగిన కోట్లాది రూపాయల లావాదేవీలు జరగుతుండటం, విదేశాల నుంచి కోట్లాది రూపాయలు ఆయన ఖాతాలోకి ప్రవహించటం పై పక్కా ఆధారాలు సంపాదించిన ఎన్‌ఫోర్స్‌మెంట్  అధికారులు, ఆ జమా ఖర్చుల లెక్కలు తెలుసుకునేందుకే ఇవాళ సోదాలు నిర్వహించినట్లుగా వార్తలు వస్తున్నాయి.


రెండు వారాల క్రితం రేవంత్ రెడ్డి సోదరుడికి చెందిన ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి కూడా విదేశాల నుంచి భారీగా నిధులు రావడం గమనించిన ఐటీ శాఖ వెంటనే నోటీసులు పంపించినట్లు సమాచారం. దీనిపై రేవంత్ రెడ్డి నుంచి కానీ, అతని సోదరుడి నుంచి కానీ ఎలాంటి సమాధానం రాకపోవడం కూడా ఈ దాడులకు కారణమైంది.

Image result for raids on revanth relatives & houses 
అరవైకి పైగా షెల్ కంపెనీల ద్వారా విదేశీ నిధులు ముఖ్యంగా కౌలాలంపూర్ నుండి వచ్చిన నిధులు తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లపై  రేవంత్ రెడ్డి మార్చాడనే ఆరోపణలు  ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆదాయ పన్ను  అధికారులు నేడు అంటే గురువారం నాడు రేవంత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు. అమెరికా, దుబాయ్, మలేషియాల నుండి పెద్ద ఎత్తున నిధులను  రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు వచ్చి చేరిందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసి ధృవీకరించేందుకు ఐటీ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నట్టు ప్రచారం. 
Related image
2014 లో రేవంత్‌ ఖాతాలో ఒకే రోజు ₹ 9 కోట్లు జమ ఐనట్లు ఐటీ అధికారులకు రామారావు అనే న్యాయవాది ఐటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.ఈ ఫిర్యాదు ఆధారం గా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా 2009 నుండి దాఖలు చేసిన అఫిడవిట్లో రేవంత్ తన ఆస్తులు ₹ 3.6 కోట్లు అని పేర్కొన్నాడు. 2014 నాడు ఎన్నికల అఫిడవిట్ ‌లో తన ఆస్తులను ₹ 13.12 కోట్లుగా చూపారు. అయితే ఐదేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ₹ 10 కోట్లను ఎలా సంపాదించారని  ఫిర్యాదు దారుడు రేవంత్‌ గురించి ప్రశ్నించారని సమాచారం.
Image result for raids on revanth relatives & houses
రేవంత్ తన ఆదాయాన్ని ఏడాదికి ₹ 5 లక్షలుగా పేర్కొన్న విషయాన్ని కూడ ఫిర్యాదు దారుడు పేర్కొన్నాడు. ఫారిన్ ఎక్చేంజ్ మానేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించి విదేశాలనుండి విపరీతంగా ప్రవహించిన సంపదను ఇక్కడ ఆస్తులను రేవంత్ కూడబెట్టారని ఈడీ, ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఈ రెండు సంస్థలు రేవంత్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.


ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో పాటు  అల్లుడు, వియ్యంకుడిపై కూడ ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి వియ్యకునికి చెందిన సంస్థ అక్రమాలకు కేంద్రం గా ఉందనే ఆరోపణలుఉన్నాయి. బ్యాంకులను మోసంచేసి ₹ 65 కోట్లు,  వ్యవసాయరుణాల పేరుతో ₹75 కోట్లు కొల్లగొట్టాడని ఫిర్యాదు దారుడు ఐటీకి ఇచ్చినట్టు సమాచారం.


"ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002, బ్లాక్ మనీ ఇంకంటాక్స్-2015, ప్రోహిబిషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్-1988, ప్రోహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్-1988  చట్టాల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. షెల్ కంపెనీల ద్వారా కోట్లాది రూపాయాలను రేవంత్ రెడ్డి  కుటుంబసభ్యులు పొందారని ఆ న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. పైన వివరించిన విభిన్న చట్టాల క్రింద రేవంత్ రెడ్దికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
Image result for revanth reddy committed crimes under FEMA act India
అయితే రేవంత్ రెడ్డి ఫెమా నిబంధనలను ఉల్లంఘించి, బినామీ పేర్లతో తనతో పాటు తన కుటుంబసభ్యుల పేర్లతో వందల కోట్లను సంపాదించారని  ఫిర్యాదు దారుడు ఐటీ అధికారు లకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: