జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా రెండో విడత పర్యటన లో దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చింతమనేని ప్రభాకర్ ఒక ఆకు రౌడీ ..వీధి రౌడి.. గాలి రౌడీ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ స్టేట్ లో కలకలం సృష్టిస్తున్నాయి.

Image result for janasena

ఇదే క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు చింతమనేని ప్రభాకర్ ఘాటుగానే స్పందించారు. ఒక ప్రధాన పార్టీ అధ్యక్షుడు అయి ఉండి నాలాంటి నియోజకవర్గ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మాట్లాడడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

Image result for janasena denduluru

నేను ప్రజా సమస్యల గురించి రౌడీగా పోరాడుతాను తప్ప..ప్రజలపై నేను ఎప్పుడు రౌడీయిజం ప్రదర్శన లేదని మీడియా సముఖంగా తెలిపారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. నేను కనుక పవన్ కళ్యాణ్ ని దూషిస్తే మూడు రోజులపాటు అన్నపానాలు పుచ్చు కోరని అన్నారు.

Image result for janasena denduluru

దీంతో వచ్చే ఎన్నికల్లో చింతమనేనికి చెక్ పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున కుదిరితే వనజాక్షి రాకపోతే తన అన్నయ్య నాగేంద్రబాబు ని నిలబెట్టాలనే అభిప్రాయంలో ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. 2019 ఎన్నికలలో ప్రజలపై దురుసుగా ప్రవర్తించే ఇటువంటి నాయకుడికి తగిన విధంగా జనసేన పార్టీ తరఫునుండి రాజకీయ దెబ్బతగిలేలా పవన్ కళ్యాణ్ దెందులూరు నియోజకవర్గంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు పార్టీ నుండి వస్తున్న సమాచారం.




మరింత సమాచారం తెలుసుకోండి: