సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా టీవిలకు అత్తుకొన్ని పోతుంటారు.  ప్రపంచలో ఎన్ని జట్లు ఆడినా..భారత్ - పాక్ కి మద్య జరిగే ఆట అంటే మరీ ఉత్సాహంతో చూస్తుంటారు.  ఇది రెండు జట్ల మద్య ఆడే గేమ్ గా కాకుండా రెండు దేశాల మద్య జరిగే యుద్దంలా భావిస్తుంటారు. తాజాగా ఆసియా కప్ 2018 లో భారత్ చేతిలో రెండు సార్లు పాక్ ఓడిపోవడం అక్కడ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.  ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. 

వివరాల్లోకి వెళితే..పాకిస్థాన్ జట్టు ఆటగాడు అయిన షోయబ్ మాలిక్‌ను అవమానించేలా ట్వీట్ చేసిన ఓ పాక్ జర్నలిస్టు..తన ఆటతీరుతో సానియాను ఏమాత్రం ఇంప్రెస్ చేశాడో ఎవరైనా షోయబ్‌ను అడగండి. కనీసం తర్వాతి టోర్నమెంటులోనైనా దేశం కోసం ఆడతాడేమో తెలుసుకోండి. అయినా, భార్యను సంతోష పరిచేందుకు ఆడే వ్యక్తి నుంచి ఈ దేశం ఇంతకంటే ఇంకేమి ఆశిస్తుంది? అంటూ ఎద్దేవా చేశాడు.

ఇది కాస్త వైరల్ కావడంతో..సానియా మిర్జా దృష్టికి వచ్చింది.  దాంతో ఆ జర్నలిస్ట్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.  అరే బేచారా.. అమాయకుడిలా ఉన్నావే. నువ్వో ప్రత్యేకమైన ఆసియా కప్‌ను చూస్తున్నట్టుంది  అని ట్వీట్ చేసింది. అయితే సానియా మిర్జా ట్విట్ మరింత సంచలనం కావడంత వెంటనే ఆ జర్నలిస్ట్ తన ట్విట్ డిలీట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: