తెలంగాణలో మహా కూటమి నుంచి పోటీకి దిగుతున్న టీడీపీకి అన్ని ఉన్నా అయిదవతనం లేదన్నట్లుగా పరిస్తితి తయారైంది. పార్టీకి క్యాడర్ ఉంది. పొత్తులు, ఎత్తులూ కూడా ఉన్నాయి, నడిపించే నాయకుడే కరవు అయ్యారు. చంద్రబాబు ఆయుధం పట్టన్ అంటూ కురుక్షేత్రంలో క్రిష్ణుడి మాదిరిగా ఖండితంగా చెప్పేశాక పూర్తిగా డీలా పడటం టీడీపీ నేతల వంతైంది. దానికి విరుగుడు మంత్రాన్ని ఇపుడు కనిపెట్టారుట.


\బాలయ్యే దిక్కు :


నందమూరి అందగాడు, అన్న గారి కుమారుడు బాలక్రిష్ణ ఇపుడు తెలంగాణా టీడీపీ స్టార్ కాంపేనియర్ గా మారుతున్నారట. ఆయనతో మొత్తం ప్రచారం చేయించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని భోగట్టా. బాలయ్య అయితే ఎటూ క్రేజ్ ఉంటుంది, పైగా అన్న గారి కొడుకు అన్న సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది, కేసీయార్ తో మంచి రిలేషన్లు కూడా ఉన్నందున ఆయన వస్తే టీయారెస్ నుంచి కూడా పెద్దగా విమర్శలు ఉండవని బాబు మంత్రాంగం చేస్తున్నారుట.


ఖమ్మం గుమ్మం నుంచి :


తెలంగాణలో మొదట ఖమ్మం జిల్లాలో బాలయ్య పర్యటించబోతున్నారు. అక్టోబర్ 1వ తేదీన కృష్ణాజిల్లా నందిగామ మీదుగా మధిర రానున్న బాలయ్య… పలు గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించడంతో పాటు సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా జరిగే ప్రచార సభలో పాల్గొననున్నారు.  తమ అభిమాన హీరో, టీడీపీ నాయకుడు బాలకృష్ణ పర్యటన ఖరారవడంతో ఈ కార్యక్రమాలకు ప్రజలు భారీగా తరలివస్తారని నాయకులు ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో.. బాలకృష్ణ పర్యటన ఉమ్మడి జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనుంది. 


మొత్తం చుట్టేస్తారట :


మహాకూటమి సీట్ల సర్ధుబాటు తర్వాత బాలయ్య టీడీపీ పోటీ చేయబోయే అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది. జీవీఎంసీ ఎన్నికల్లో బాలయ్య అల్లుడు నారా లోకేష్ ప్రచారం చేశారు. అయినా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇపుడు బాలయ్య ప్రయోగం ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: