రేవంత్ రెడ్డి మీద ఈడీ దాడులు చేయడం తో రేవంత్ రెడ్డి తో సహా అందరూ కాంగ్రెస్ నేతలు ఇది తెరాస పనే అని కుట్ర పన్నుతోందని చెబుతున్నారు  అయితే వారు చెప్పిన దానిలో కూడా నిజం ఉందనుకోవాల్సిందే.  రేవంత్‌ రెడ్డి ఎవరికి ప్రత్యర్థి. టీఆర్‌ఎస్‌కు అని అందరికీ తెలుసు. ప్రధానంగా కేసీఆర్‌కు వ్యక్తిగతంగా శత్రువు. కేంద్రం సహకారం లేనిదే ఐటీ, ఈడీ దాడులు చేయడం సాధ్యంకాదని ఇప్పటివరకు జరిగిన అనేక కేసులను చూస్తే అర్థమవుతోందని కొందరు నాయకులు చెబుతున్నారు. కేసీఆర్‌, ప్రధాని మోదీ పార్టీలు రాజకీయంగా దూరంగా ఉండొచ్చు. కాని ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలున్నాయి.

Image result for revanth reddy

సీబీఐ, ఐటీ, ఈడీ మొదలైన సంస్థలు పేరుకు స్వంతత్ర సంస్థలుగా చెప్పుకున్నప్పటికీ కేంద్రం ఆదేశాలు లేనిదే దాడులు చేయవని అంటున్నారు. కాకపోతే ఏదో ఒక ఫిర్యాదు అందాలి. కాంగ్రెసు, టీడీపీ నేతలు రాసిన లేఖ ఆధారంగా న్యాయస్థానం వైకాపా అధినేత జగన్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. కేసు ఏళ్ల తరబడి ఇంకా విచారణలోనే ఉంది. నేరం రుజువవుతుందో కాదో చెప్పలేం. రేవంత్‌ విషయంలో రామారావు అనే న్యాయవాది ఈడీకి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా వెంటనే ఈడీ. ఐటీ అధికారులు వెంటనే దాడులు ప్రారంభించారు.

Image result for revanth reddy

రామారావు వెనక ఎవరున్నారనేది తెలియకపోయినా ఎన్నికల సమయంలో ఈ దాడులు జరగడంతో టీఆర్‌ఎస్‌ చేయించిన పనేనని కొందరు అనుమానపడుతున్నారు. జగన్‌ విషయంలో ఫిర్యాదు చేసిన నేతలు ఎవరో అందరికీ తెలుసు. కాని రేవంత్‌ విషయంలో న్యాయవాది పేరు బయటకు వచ్చింది. ఆరోపణలు, సోదాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇదంతా చూసినవారికి రేవంత్‌ వెనక ఇంత కథ ఉందా అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: