రేవంత్ రెడ్డి కి ఐటీ పోటు గుచ్చుకున్నది తెరాస ప్రభుత్వం అదును చూసి దెబ్బ కొట్టింది. అయితే కాంగ్రెస్ నేతలు మహా ఆనందంగా ఉన్నారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ ఎదుగుదల మిగతా నాయకులకు ఇబ్బందిగా మారింది.  పార్టీలో నిన్నలా మొన్నచేరి అప్పుడే పెద్ద పెద్ద పదవులు హోదాలు అందుకునేస్తున్నాడు రేవంత్. అవి పార్టీ పదవులే కావొచ్చు, పెద్దగా పనికిరానివే కావొచ్చు.. వాటికి కూడా కాంగ్రెస్ లో తీవ్రమైన, తీవ్రాతి తీవ్రమైన పోటీ ఉండనే ఉంటుంది.

Image result for revanth reddy

అలాంటి పార్టీలో రేవంత్ రెడ్డి బాగా ‘ఎదిగిపోవడం’ ఆ పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. అందులోనూ ఎవరికి వారు ముఖ్యమంత్రి అభ్యర్థులే కదా. అలాంటి పార్టీలో ఇప్పుడు చాలామంది హ్యాపీగా ఫీలవుతున్నారు. రేవంత్ రెడ్డి నిండా మునిగినట్టుగా కనిపిస్తుండటంతో కాంగ్రెస్ లో కొంతమంది ఖుషీ అవుతున్నారు.

 రేవంత్ ఇరుక్కున్నాడు, కాంగ్రెస్ నేతలు హ్యాపీ!

రేవంత్ అడ్డు తమకు కొంతవరకూ తొలగినట్టే అని వీళ్లు భావిస్తున్నారు. ఇక ఎలాగూ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రేవంత్ పై ఐటీ అటాక్ తో రిలాక్స్ అవుతున్నారు. పైకైతే సంఘీభావం ప్రకటిస్తున్నారు. రేవంత్ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ పై దాడిని ఖండిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. లోలోపల మాత్రం రేవంత్ కు తగిన శాస్తి జరిగిందని ఫీలవుతున్న నేతలే ఎక్కువని తెలుస్తోంది. అతడి హైపర్ గ్రోత్ తో ఇబ్బంది పడుతున్న సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఒక ‘ముఖ్యమంత్రి అభ్యర్థి’ మైనస్ అయినట్టే అని వాళ్లు లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు రేవంత్ డీప్ ట్రబుల్ లో పడ్డాడని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: