వైఎస్ జగన్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. రేపటి రోజున వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని ఏడాదిగా రోడ్లను కొలుస్తూ అలుపెరగని బాటసారిలా సాగిపోతున్నారు. జగన్ సరే మరి ఆయన పార్టీ ఏమైనా గేరప్ అయిందా, నాయకులు జనంలోకి పోతున్నారా. పార్టీ ఎక్కడ పనిచేస్తోంది, మరెక్కడ పడకేస్తోంది. ఇపుడు ఆ వివరాలన్నీ జగన్ దగ్గర ఉన్నాయి.


జగన్ తో పీకే  కీలక భేటి :


విజయనగరం జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ తో ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ మధ్యన ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బీహార్ కి చెందిన ఆయన అక్కడ  నితీష్ నాయకత్వంలోని  జనతాదళ్ లో  చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ పీకే సేవలు ఇక వైసీపీకి లేవు అంకుంటున్న టైంలో ఆయన జగన్ ని కలవడం ఇంటరెస్టింగ్ మ్యాటరే మరి.


నివేదికలో ఏముంది :


ప్రశాంత్ కిశోర్ జగన్ కి ఏపీలో వైసీపీ పరిస్తితిపై పూర్తి నివేదికను ఇచ్చినట్లుగా భోగట్టా. ఆ నివేదిక ఇపుడు పార్టీలో చర్చను రేపుతోంది. ఏముంది అందులోనని నేతలంతా  తెగ టెన్షన్ పడుతున్నారట. నిజానికి జగన్ తాను అడుగు పెట్టిన చోటల్లా  సర్వేలు చేయిస్తూ పోతున్నారు. వాటికి తగినట్లుగానే ఆయన సీట్లు కూడా కేటాయిస్తూ వస్తున్నారు. 


గుండెళ్ళో గుబులు :


వాస్తవానికి  జగన్ పార్టీలో నాయకుల గురించి తెలియాలంటే పెద్దగా సర్వేలు చేయనవసరం లేదు. చాల తక్కువ మంది మాత్రమే జనంలో ఉంటున్నారు. జగన్ ఏ ప్రోగ్రాం ఇచ్చినా తూతూ మంత్రంగానే చేస్తున్నారు తప్ప  ప్రజ‌ల సమస్యలు పట్టడం లేదు. ఈ పరిస్తితుల్లో పీకే ఇచ్చిన నివేదిక కూడా అదే చెబుతోందని అనుకుంటున్నారు. మరి ఆ నివేదికను బేస్ చేసుకుని జగన్ యాక్షన్ లోకి దిగితే ఎవరికి షాక్ తగులుతుందోనని హడలెత్తిపోతున్నారు.
ఇప్పటికే  వైసీపీలో చాలా మందికి టిక్కెట్ల ఇక్కట్లు  రుచి చూపించిన జగన్ నివేదిక ఆసరాతో మరింతగా రెచ్చిపోతే పెద్ద తలకాయలకూ  డ్యామేజేనని అంటున్నారు. మరి చూడాలి జగన్ ఎపుడు యాక్షన్లోకి వెళ్తారో.


మరింత సమాచారం తెలుసుకోండి: