ఇటీవల పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్రలో బిజీగా ఉన్నారని మనకందరికీ తెలుసు. పశ్చిమగోదావరి జిల్లా రెండవ విడత యాత్ర లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని టార్గెట్ చేసి..చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.

Image may contain: 1 person, sitting and beard

గత మూడు రోజులుగా ఇద్దరి మధ్య రాజకీయ నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో తన పర్యటనలో భాగంగా కొల్లేరు ప్రాంతానికి పయనమైన పవన్ కళ్యాణ్ కి గుడివాకలంక ప్రజలు షాక్ ఇచ్చారు.  

Image may contain: 3 people, people smiling, beard

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం గుడివాకలంక గ్రామ పెద్దలు పవన్ పర్యటనను బహిష్కరించారు. అంతేకాదు పవన్ పర్యటనకు ఆ గ్రామస్తులెవరైనా వెళ్తే రూ. 50వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Image may contain: 1 person, standing, sky, cloud, ocean, outdoor and nature

అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో అధికార, ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా గుడివాకలంక గ్రామ పెద్దలు తీసుకున నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలో కొంతమంది జనసేన పార్టీ మద్దతుదారులు..పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది చింతమనేని ప్రభాకర్ పని అని అభిప్రాయపడుతున్నారు. దీంతో కొల్లేరు ప్రాంతాన్ని పర్యటించి పవన్ కళ్యాణ్ వెంటనే వెనుదిరిగారు.




మరింత సమాచారం తెలుసుకోండి: