తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగుతోంది. 2014 ఎన్నికలలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని గెలవాలని తీవ్ర కసితో ఉంది టీ కాంగ్రెస్. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మండిపడ్డారు.

Image result for kcr

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో చేతులు కలిపి దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల వరంగల్ జిల్లాలో కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలు అనే కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులపై ఆ పార్టీ అధినేత పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Image result for kcr uttham

ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ నాయకులను చులకన చేయాలనే భావంతో ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నేతలైన జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డిపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 'అధికారంలోకి వచ్చేది మేమేనని... రాగానే వడ్డీతో సహా కేసీఆర్ రుణం తీర్చుకుంటాం' అని ఉత్తమ్‌ హెచ్చరించారు.

Image result for kcr uttham

ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్న ఉత్తమ్.. అభ్యర్థులు ఎవరైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నూటికి నూరు శాతం కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని..కనుక రాష్ట్రంలో ఉన్న అధికారులు గత రాజకీయ పార్టీలకు సహకరించాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: