జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలో టీడీపీ మీద విరుచుకుపడిన సంగతీ తెలిసిందే ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే పవన్ జగన్ మీద కూడా సెటైర్స్ వేసినాడు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు ఎందుకు కట్టించడం లేదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. తాను సీఎంను అయితే వృద్ధుల సంక్షేమం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తానని చెప్పారు.


pawan kalyan

ఓ వృద్ధురాలు తనపై చూపించిన ఆప్యాయతకు తానెంతో భావోద్వేగానికి గురయ్యానని.. కళ్లు చెమ్మగిల్లాయని పవన్ తెలిపారు. పిల్లల్ని కని పెంచి.. చదివి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలిపెట్టడం సరికాదన్నారు. అంతేగాకుండా వృద్ధులకు వైకాపా చీఫ్ జగన్ ముద్దులు పెట్టడంపై జనసేనాని సెటైర్లు వేశారు. వృద్ధులకు ముద్దులు పెట్టితే సరిపోదని.. అలా చేస్తే వారి బాధలు తీరిపోవని జగన్‌ను ఉద్దేశించి.. పవన్ ఎద్దేవా చేశారు.


పవన్ హామీలు వింటుంటే ప్రజలు నోరెళ్ళ బెడుతున్నారు.. పింఛన్ పదివేలు...!

అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలను గాడిలో పెట్టడంలో డీజీపీ వైఫల్యం చెందారని...అందుకే ఇలాంటి కిరాయి హంతకులు రెచ్చిపోతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇకపోతే.. తనకు ప్రాణహాని ఉందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై కుట్రలు చేస్తున్న వారు అధికారపక్షమో, ప్రతిపక్షమో తెలీదన్నారు. ఇదే సమయంలో తనపై కుట్రలు చేస్తున్న వారెవరో తెలుసంటూ పవన్ వ్యాఖ్యానించడం కొత్త చర్చలకు తెరలేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: