వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరో మారు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠం పట్టాలని పట్టుదలతో ఉన్న బాబు ఈసారి తన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా ఇతర ప్రాంతాలకు మారుతారని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఇపుడు దానిపైన హాట్ హాట్ చర్చ సాగుతోంది.


తిరుపతి నుంచేనట :


చంద్రబాబు 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తారని లేటెస్త్ టాక్. బాబు విద్యార్ధి రాజకీయ జీవితమంతా తిరుపతిలోనే సాగింది. దానికి తోడు ఆయనకు వెంకన్న పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి. ఈ కారణాలతో బాబు తిరుపతిని ఎంచుకున్నారని అంటున్నారు. అంతే కాదు సెంటిమెంట్ వల్ల కూడా బాబు తిరుపతికి షిఫ్ట్ అవుతున్నారట. అప్పట్లో అన్న నందమూరి పార్టీ పెట్టి తిరుపతి నుంచి తొలిసారి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు.
వచ్చే ఎన్నికలు నువ్వా నేనా అన్నంతగా సాగుతున్న నేపధ్యంలో బాబు తిరుపతి నుంచి పోటీ చేయడం ద్వారా ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలనుకుంటున్నారుట.


కుప్పం లోకెష్ కే :


బాబు తాను గత మూడు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటును తనయుడు లోకేష్ కి ఇవ్వాలనుకుంటున్నారుట. టీడీపీ భావి వారసుడిగా ఉన్న లోకేష్ మరో ముప్పయ్యేళ్ళు అక్కడ నుంచి పోటీ చేసేటట్టుగా బలమైన పునాది వేసేందుకే  బాబు తన సీటును త్యాగం చేస్తున్నారుట. లోకేష్ ని ప్రత్యక్ష  ఎన్నికల నిలబెట్టేందుకు కుప్పం అయితేనే బెటర్ చాయిస్ అవుతుందని బాబు భావిస్తున్నారుట. మొత్తానికి అటూ ఇటూ సెంటిమెంట్ పండి బాబు తిరుపతికి షిఫ్ట్ అవుతారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: