ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తొందరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంతో ఏపీ రాజకీయాల్లో మరింత వేడి రాజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపై ఢీ అంటే ఢీ అన్నట్లుగా పాలిటిక్స్ సాగుతుందని అంచనా వేస్తున్నారు. పాదయాత్ర తరువాత జగన్ తన జోరును మరింతంగా పెంచనున్నారని భోగట్టా.  అదే జరిగితే అధికార తెలుగుదేశం ఇరుకున పడడం ఖాయం.


చలో అమరావతి :


ఏపీలో టీడీపీ కుదురుకుంది. ప్రతిపక్ష వైసీపీ మాత్రం తెలంగాణా రాజధాని హైదరాబాద్ నుంచే రాజకీయాలు చేస్తూ వస్తోంది. ఇది పెద్ద విమర్శలకు కూడ దారితీస్తోంది. ఏది ఏమైనా జగన్ గత ఏడాదిగా పాదయాత్ర పేరిట జనంలో ఉన్నారు. దాంతో ఆయన మొత్తంగా ఏపీలోనే ఉన్నట్లైంది. దీన్ని కంటిన్యూ చేసేలా తన మకాం ని పూర్తిగా అమరావతికి షిఫ్ట్ చేయాలని జగన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు భోగట్టా. 


అక్కడ నుంచే కధ :


పాదయాత్ర ఇప్పటి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ కి పూర్తి అవుతుంది. ఆ తరువాత జగన్ తన నివాసాన్ని అమరావతి కి మార్చుతారట. అక్కడ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం పూర్తి హంగులతో నిర్మించే పని ఇపుడు చురుకుగా సాగుతోంది. అదే విధంగా కుటుంబంతో సహా జగన్ అమరావతి కి తరలి వస్తారట. ఇకపై  అక్కడ నుంచే రోజు వారీ రాజకీయమంతా జగన్ నేరుగా ఉండి నడిపించబోతున్నారుట.


అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో వేడి వాడి బాగానే రాజుకునే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయి  ఇప్పటికే టీడీపీ రాజధాని చుట్టూ అల్లుకుని వుంది, వైసీపీ కూడా  రెడీ అయితే అమరావతి  హాట్ హాట్ అవడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: