ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. మాజీ మంత్రి కూడా. ఓ టైంలో జిల్లా పాలిటిక్స్ లో చక్రం తిప్పిన నేత. అటువంటి నాయకుడు చాలకాలంగా పొలిటికల్ క్రాస్ రోడ్డు మీద ఉన్నారు. ఎన్నికలు ఓ వైపు తరుముకువస్తున్నాయి. మరి. ఆయన రూట్ ఎటూ అంటే క్లారిటీ రావడం లేదు. ఇపుడు ఓ పార్టీ నో ఎంట్రీ బోర్డ్ పెట్టిందట. మరి సైకిలెక్కేస్తారా 


కొణతాలకు దారేదీ :


విశాఖ జిల్లాలో ఒకపుడు కీలకమైన నాయకునిగా ఉన్న కొణతాలా రామక్రిష్ణ ఏ పార్టీలో చేరుతారన్నది ఇంటెరెస్టింగ్ మ్యాటర్ గా ఉంది. ఆయన జిల్లాలో బలమైన సామజికవర్గానికి చెందిన నాయకుడు కావడంతో పాటు చాలా మంది శిష్యగణం అనుచరులు కలిగిన లీడర్. దాంతో ఆయన ఏ వైపు చూస్తారా అని అంతా అనుకుంటున్నారు. పెదవి విప్పకుండా చాలాకాలంగా ఉంటున్న కొణతాల దారెటు అన్నది అర్ధం కావడం లేదంటున్నారు.


వైసీపీలోకి నో :


కొణతాల వైసీపీలో చేరేందుకు మార్గాలు లేవని అంటున్నారు. ఆయన చేరికను పార్టీలోని కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో  జగన్ సైతం అటే మొగ్గు చూపారని లేటేస్ట్ టాక్. దాంతో కొణతాలకు వైసీపీ ఇంచు మించుగా తలుపులు మూసుకుపోయినట్లేనంటున్నారు.


టీడీపీ ఆప్షన్ :


ఇకపోతే కొణతాలకు ఆయన వియ్యంకుడు వరస అయ్యే టీడీపీ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఉన్నారు. ఆయన టీడీపీలోకి కొణతాలకు తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి కొణతాల మాత్రం మొత్తం టీడీపీ వ్యతిరేక పాలిటిక్స్ నే రాజకీయం చేస్తూ వచ్చారు. ఆయనకు సైకిలెక్కడం ఇష్టం లేదని అంటున్నారు. కానీ అనివార్యమైతే తప్పదని టాక్ నడుస్తోంది.


ఎంపీగా పోటీ :

వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా కొణతాల పోటీ చేస్తారని అంటున్నారు. టీడీపీ ఆ విధంగా ఆఫర్ ఇస్తోందని తెలుస్తోంది. అదే జరిగితే కొణతాల సైకిలెక్కడం ష్యూర్ అంటున్నారు. మొత్తానికి మాజీ మంత్రి పొలిటికల్ రూట్ పై క్లారిటీ రావడానికి కొంత టైం పట్టినా ఆయన చివరికి చేరేది మాత్రం టీడీపీ గూటికేనని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: