ఆయన సాటి లేని మేటి ఇమేజ్ ఉన్న నాయకుడు. ఎలా చూసుకున్నా క్రౌడ్ పుల్లర్. యూత్ లో విపరీతమైన క్రేజ్. ఆయన అంటే పడి చచ్చే కాదు ప్రాణం ఇచ్చే అభిమాన జనం వున్నారు. నిజానికి అయన కంటే ఇంతలా ఫాలోయింగ్ ఉన్నా వారు వర్తమానంలో ఎవరూ లేరు. మరి అన్నీ ఉన్నా ఆ నాయకుడు ఎందుచేత  సునామీ స్రుష్టించలేకపోతున్నారు. మరెందుచేత తుపానులా దూసుకురాలేకపోతున్నారు.


లోపాలే శాపాలా :


ఆయనెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వెండి తెరపై ధీరోదాత్తమైన పాత్రలతో హడలెత్తించే ఆ హీరో రాజకీయ తెరపై మాత్రం తడబడుతున్నారు. తప్పుటడుగులు వేస్తున్నారు. ఆయన రాజకీయ జీవితం చూస్తూంటే గ్రాఫ్ అలా పడిపోతోందనిపిస్తోంది. ఇందుకు కారణాలు ఎన్ని ఉన్నా ప్రధానంగా ఆయన అనుసరిస్తున్న విధానాలే శాపాలు అవుతున్నాయంటున్నారు.


మూస రాజకీయమే :


పవన్ అంటే ఓ వెరైటీ, ఆయన ఇతర హీరోల్లా సినిమాలు వరసగా చేయరు. డ్యాన్సులు ఫైట్లు కూడా అందరిలా చేయాలని చూడరు. తనకు నచ్చించి, వచ్చిందీ చెయడమే పవనిజం. అదే అభిమానులను కోటానుకోట్లను తయారుచేసింది. అటువంటి పవన్ రాజకీయల్లో కూడా రోటీన్ కి భిన్నంగా ఉంటారని అంతా భావించారు. అయన కాస్తా జాగ్రత్తగా అడుగులు వేస్తే మరో అన్న నందమూరిలా రికార్డులు క్రియేట్ చేస్తారని అనుకున్నారు. కానీ మూస రాజకీయమే పవన్ కూడా చేస్తున్నారు.


పస లేని ప్రసంగాలు :


పవన్ పస లేని ప్రసంగాలు చేస్తున్నారు. అందరిలా అన్నీ ఉచితమని హామీలు ఇస్తున్నారు. కులం లేదంటూనే తన చుట్టూ వాళ్ళనే తిప్పుకుంటున్నారు. ఫిరాయించిన వాళ్ళకే సీట్లు, టికెట్లూ ఇస్తున్నారు. దూకుడుగా రాజకీయం చేస్తారనుకుంటే నిదానంగా సాగిపోతున్నారు. మరి పవన్ లో ఏం చూసి జనాలు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. ఆయన కొత్త రాజకీయం ఎక్కడుంది.


బేలతనం కాదా :


నన్ను చంపేస్తున్నరంటూ లేటెస్ట్ గా పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బేలగా పేలవంగా ఉందని సెటైర్లు పడుతున్నాయంటే అది పవన్ తప్పే. నాయకుడు బీరువుగా ఉండరాదు. ధీరుడిగా ఉండాలి. పవన్ హీరో, ఆయన నుంచి అభిమానులు పిరికిమాటలు ఆశించరు. మరి పవన్ ఏ కారణంగా చేశారో కానీ అనేశారు. నిజానికి పవన్ కి అలాంటి సమాచారమే వచ్చి ఉంటే పోలీసులను ఆశ్రయించి గుట్టు చప్పుడు కాకుండా ఆ వ్యవహారం సంగతి తేల్చుకోవాలి. 

బహిరంగ సభల్లో చెప్పడం అంటే సానుభూతి కోసమేనన్నది తెలిసిపోతోంది. మరి ఇలాంటి పాలిటిక్స్ తో పవన్ తానూ ఆ తానులో ముక్కనే అనిపించేసుకున్నారు. ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర నాయకుడిగా మాట్లాడాల్సిన చోట లోకల్  లీడర్స్ కి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి వారి స్థాయి పెంచడమూ. తానూ తగ్గిపోవడమూ అవగాహనా లోపమే. మరి పవన్ ఇప్పటికైన మారతారా.


మరింత సమాచారం తెలుసుకోండి: