వివాహితుల మధ్య వివాహేతర బంధం నేరం కాదని సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సెక్షన్ 497 ప్రకారం పెళ్లయిన పురుషుడు, మరో వ్యక్తి భార్య తో వివాహేతర సంబంధం కలిగి ఉండటం నేరం. ఇది రాజ్యాంగ రీత్యా చెల్లుబాటు కాదని, సెక్షన్ 497 కాలం చెల్లిన చట్టమని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళలకు కూడా పురుషులతో సమాన హక్కులు ఉంటాయని, భర్తలు భార్యలను తమ ఆస్తిగా భావించొద్దని సుప్రీం తెలిపింది. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తుల్లో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఒకరు.


ఇప్పటి వరకూ ఉన్న చట్టం ప్రకారం వివాహితుడు తన భార్యతో కాకుండా మరో వివాహిత తో వివాహేతర సంబంధం పెట్టు కోవడం నేరం. తన భర్త కు మరో మహిళతో సంబంధం ఉందని భార్య కేసు పెడితే అతణ్ని ఐదేళ్లపాటు జైలుకు పంపొచ్చు. స్త్రీ పురుషులిద్దరూ ఇలాంటి చర్యకు పాల్పడితే, సెక్షన్ 497 ప్రకారం కేవలం పురుషుణ్ని మాత్రమే శిక్షించే వీలుంది. దీన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. వివాహేతర సంబంధం లో ఇద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పుడు సెక్షన్ 497 చట్టబద్ధం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక వివాహితుడు వితంతువుతో లేదా పెళ్లికాని అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకోవడం వ్యభిచారం (అడల్టరీ) కిందకు రాదు. 

Image result for YV Chandra chuD  & DY chandrachuD

సెక్షన్ 497 ను కొట్టివేసే క్రమంలో జస్టిస్ చంద్రచూడ్ గతంలో తన తండ్రి, మాజీ చీఫ్ జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా తీర్పునిచ్చారు. చంద్రచూడ్  తన తండ్రి ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా తీర్పు వెలువరించడం ఇది తొలిసారి కాదు. గోప్యత కూడా ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని గత ఏడాది ఆయన తీర్పు నిచ్చారు. జీవించే హక్కులో భాగంగా గోప్యత అనేది ప్రాథమిక హక్కుల్లోకి వస్తుందని సుప్రీంలో పిటీషన్ దాఖలు చేయగా, 1976లో సుప్రీం అత్యున్నత ధర్మాసనం దాన్ని కొట్టివేసింది. ఈ తీర్పు వెలువరించిన ఐదుగురు జడ్జిల్లో వైవీ చంద్రచుద్ ఒకరు.


33 ఏళ్ల క్రితం సీనియర్ చంద్రచూడ్ తీర్పు చెబుతూ అన్ని వివాహేతర సంబంధాలు కాకపోయినప్పటికీ కొన్ని మాత్రం నేరాలుగా పరిగణించాల్సిందేనని చెప్పారు. కానీ గురువారం జూనియర్ చంద్రచూడ్ మాత్రం తండ్రి తీర్పుతో విబేధిస్తూ అసలు అక్రమసంబంధాలు నేరపూరితం కాదని పేర్కొన్నారు. అంతేకాదు పైళ్ళైన మహిళ కేవలం తన భర్త తోనే శృంగారంలో పాల్గొనాలని లేదని ఆమె భర్త సొత్తు కాదని అభిప్రాయపడ్డారు. ఆమెకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు.

Image result for YV Chandra chuD  & DY chandrachuD

1985లో జస్టిస్ చంద్రచూడ్ తండ్రి సీనియర్ చంద్రచూడ్ మాత్రం సెక్షన్ 497 యొక్క రాజ్యాంగ సమ్మతిని సమర్థించారు. సౌమిత్రి విష్ణు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నాటి ఛీఫ్ జస్టిస్‌ గా ఉన్న చంద్రచూడ్ భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 497ను తొలగిస్తే పూర్తి స్థాయిలో అక్రమ సంబంధాలు ఏర్పడుతాయని చెబుతూ ఇది రాజ్యాంగ సమ్మతమేనంటూ తీర్పు చెప్పారు. సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని అక్రమసంబంధాలను నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. తద్వారా వివాహ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


సెక్షన్ 497 చట్టబద్ధమే అని 1985 లో సీజేఐ‌ వైవీ చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును ఆయన కుమారుడైన డీవీ చంద్రచూడ్ 33 ఏళ్ల తర్వాత కొట్టివేశారు. 

Image result for YV Chandra chuD  & DY chandrachuD

1976లో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దాన్ని సమర్థించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సీనియర్ చంద్రచూడ్ కూడా సభ్యునిగా ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ తీర్పు తో కూడా జూనియర్ చంద్రచూడ్ విబేధించారు. ఎమర్జెన్సీ విధించడమంటే ఒక వ్యక్తికి సంబంధించిన జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేయడమేనని అది రాజ్యాంగ విరుద్ధమంటూ జూనియర్ చంద్రచూడ్ చెప్పారు.


ఇద్దరూ తండ్రి కొడుకులే. కాని తీర్పు ఉత్తర దక్షిణ దృవాలంత వైరుధ్యం. చట్టం న్యాయం ఒకటే. కాని దానిలో మార్పు రాలేదు. కాని తీర్పులోనే బేధం. దీన్ని తరాల అంతరం అందామా? ఆలోచనా చమత్కారం అందామా? కాలంతో వచ్చిన మనుషుల్లో మార్పందామా? అసలు కాలం సమాజం తరాల అంతరాల్లో తెచ్చిన విప్లవం అందామా?  

మరింత సమాచారం తెలుసుకోండి: