రేవంత్ రెడ్డి మీద ఐటీ దాడులు ఒక్కసారిగా అతన్ని కలవరపాటుకు గురి చేసినాయి. అయితే ఆ కేసులు ఎన్ని రోజులు నిలబడతాయని చెప్పడం కష్టమే అని చెప్పొచ్చు. అయితే అక్రమాస్తులు, ఐటీ గొడవలు.. ఇవి రాజకీయ నాయకులకి అలవాటే. వీటిల్లో చాలావరకు రాజకీయ ప్రేరేపితమైనవే వుంటాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 'గడ్డి స్కామ్‌' ఏమయ్యిందో అందరికీ తెలుసు. ఆ కేసు వెలుగు చూశాక కూడా ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. మోడీ హయాంలో లాలూ, జైలుకు వెళ్ళినా.. ప్రభుత్వం మారితే, ఆయన 'సచ్ఛీలుడిగా' బయటకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. జయలలిత విషయంలో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది. దోషిగా తేలి, ముఖ్యమంత్రి పదవిని రెండు సార్లు పోగొట్టుకున్న జయలలిత, ఆ తర్వాత నిర్దోషిగా నిరూపించుకుని, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయాలు ఇలాగే వుంటాయ్‌.! 

వేల కోట్లు కాదు.. పాతిక కోట్లేనా.?

ఓటుకు నోటు వ్యవహారాన్నే తీసుకుంటే, ఆ 'ఆపరేషన్‌'కి సంబందించి మీడియా సంస్థలకు 'వీడియో ఫుటేజ్‌లు' కొందరు పనిగట్టుకుని అందించిన మాట వాస్తవం. అంటే, అది ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ వ్యవహారమని తేలిపోయినట్టే కదా.! ఇప్పుడిక, రేవంత్‌రెడ్డి అవినీతి - అక్రమాలకు సంబంధించి ఏకంగా ఓ బుక్‌లెట్‌ని మీడియా సంస్థలకు కొందరు అందించారు. ఈ లెక్కన ఇక్కడా వ్యవహారం అంతే కావొచ్చు. అలాగని అక్రమాలు జరగలేదనీ ఓ కంక్లూజన్‌కి వచ్చేయలేం. 

Image result for revanth reddy

అక్రమాస్తుల కేసులో జగన్‌పై లక్ష కోట్ల ఆరోపణలు చేసేస్తూ వచ్చారు రాజకీయ ప్రత్యర్థులు. టీడీపీ ఓ అడుగ ముందుకేసి, 16 లక్షల కోట్లని తేల్చింది. చివరికి ఏమయ్యింది.? ఆధారాలు చూపడంలో విచారణ సంస్థలు చేతులెత్తేస్తూ వస్తుండడంతో ఈ కేసులోంచి ఒకరొకరుగా బయటకు వచ్చేశారు. ఏమో, మళ్ళీ జగన్‌ మీద ఇదే కేసుకు సంబంధించి 'బలమైన ఒత్తిడి' రానుందేమో. జగన్‌ వ్యవహారంలానే తయారవబోతోంది రేవంత్‌రెడ్డి విషయం కూడా. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలూ వుండాల్సిన అవసరమే లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: