రేవంత్ రెడ్డి పై ఐటి అధికారుల‌కు ఫిర్యాదు చేసిన లాయ‌ర్ రామారావుపై ఎన్ని కేసులున్నాయో తెలుసా ?  హైద‌రాబాద్ లోని చిల‌క‌ల‌గూడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో  రామారావుపై భూ క‌బ్జా కేసుల‌తో పాటు రౌడీ షీట‌ర్  కేసు కూడా ఉంద‌నే విష‌యం వెలుగు చూడ‌టంతో సంచ‌ల‌నంగా మారింది.  ఒడిస్సాలోని బ‌రంపురం లాయ‌ర్ స్వ‌స్ద‌లం. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం హైద‌రాబాద్ వ‌చ్చి లా డిగ్రీ చేశార‌ట‌. మ‌ళ్ళీ బ‌రంపురంకు వెళ్లిపోయిన రామారావు త‌ర్వాత ఎప్పుడో మ‌ళ్ళీ న‌గ‌రానికి వ‌చ్చి  ప‌ద్మారావున‌గ‌ర్ కు వ‌చ్చి సొంత ఇల్లు కొనుక్కొని లాయర్ వృత్తిలో స్ధిర‌ప‌డ్డారు. 


ఈయ‌న ఎక్కువ‌గా వివాదంలో ఉన్న ఆస్తులు, వివాదాల్లో ఉన్న భూములు, ఫ్లాట్స్ లాంటి కేసుల‌నే వాదిస్తార‌ట‌. వివిధ కేసుల‌కు సంబంధించి క్లైంట్లు లాయ‌ర్ కాబ‌ట్టి విలువైన ప‌త్రాలు అందించ‌టం స‌మ‌జ‌మే.  అయితే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప‌త్రాల్లో విలువైన‌వైతే వెంట‌నే వాటికి న‌కిలీప‌త్రాలు త‌యారు చేస్తార‌ట‌. ఎటూ లాయ‌రే కాబ‌ట్టే  భూకబ్జాలకు పాల్ప‌డేవాడు. ఎవ‌రైనా అడ్డు తిరిగితే వాళ్ళ‌పై కేసులు వేసేవాడ‌ట‌. 


అయితే ఓ క్లైంట్ మాత్రం లాయ‌ర్ కు అడ్డం తిరిగార‌ట‌. 2013లో ప‌ద్మారావు న‌గ‌ర్ లోని త‌న ఇంటిని లాయ‌ర్ క‌బ్జా చేశాడంటూ జి. సాయిప‌వ‌న్ అనే వ్య‌క్తి చిల‌క‌ల‌గూడ పోలీసు స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. భూక‌బ్జాల‌కు సంబంధించి 2016 జ‌న‌వ‌రి 11వ తేదీన ఒక్క‌రోజే లాయ‌ర్ పై ఐదు కేసులు న‌మోద‌వ్వ‌టం గ‌మ‌నార్హం. అదే ఏడాదిలో రామారావును చిల‌క‌ల‌గూడ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు కూడా పంపారు. వెంటనే లాయ‌ర్ పై రౌడీ షీట్ కూడా తెరిచారు. ప్ర‌స్తుతం చిల‌క‌ల‌గూడ‌, చందాన‌గ‌ర్ బోయిన‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్లో 32 కేసులున్నాయి. ఇది రేవంత్  రెడ్డి అక్ర‌మాస్తులు, అవినీతిపై ఫిర్యాదు చేసిన రామారావు అస‌లు క‌థ‌. 



మరింత సమాచారం తెలుసుకోండి: