అదేంటో..అనుకున్నది ఒకటి, అయింది మరోటీ అన్నట్లుగా ఉంది పరిస్తితి. గుప్పిట మూసి ఉంచాలనుకుని ఎంతగా అనుకున్నా గుట్టు బయటకు వస్తానంటోంది. కొంప ముంచేలాగానూ ఉంది. జనాలు.. సముద్రమూ ఒక్కటే పైకి గంభీరం.. కానీ లోపల ఎన్ని సుడిగుండాలున్నాయో, మరెన్ని దావానలాలూ ఉన్నాయో. తరచి చూసే ధైర్యం ఉండొద్దూ


ముంచుకొస్తున్నాయి :


అసలు ఎన్నికల కంటే కొసరు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ముందస్తు వద్దనుకుంటే ముందస్తుగా జనం నాడిని తెలిపేలా శాస‌నమండలి ఎన్నికలు దూసుకువస్తున్నాయి. ఏపీలో  మూడు స్ధానాల్లో శాసనమండలి ఎన్నికలు తొందరలో జరగనున్నాయి. పట్టభద్రులు - ఉపాధ్యాయుల కోటాలో మార్చి 29వ తేదీకి మూడు స్ధానాలు ఖాళీ అవనున్నాయి. ఇందులో రెండు పట్టభద్రుల స్ధానాలు ఒక ఉపాధ్యాయ స్ధానానికి ఎన్నిక జరుగుతుంది. షెడ్యూల్ ఎన్నికలకు ముందు మూడు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజల నాడి తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు కీలకం అని అంతా భావిస్తున్నారు.


తేడా కొడితేనా :


పోయిన ఎన్నికల్లో పట్టభద్రులు - ఉపాధ్యాయ కోటా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అప్పట్లో  జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేడా కొట్టింది. అనంతపురం పట్టభద్రుల సీటుని వైసీపీ పట్టుకుపోయింది. మరో చోట వామపక్షాలూ సత్తా చాటాయి. ఇపుడు కూడా సాధారణ ఎన్నికలు వస్తున్న నేపధ్యం. పట్టభద్రులు, టీచర్లు ఈ రెండు వర్గాలూ ఇపుడు  బాగా యాంటీగానే ఉన్నారు. కొత్త పించన్ విషయంలో టీచర్లు గుర్రుగా ఉంటే ఉపాధి లేక గ్రాడ్యుయేట్లు మండిపోతున్నారు.  ఇక మరి వీళ్ళ చేతికే ఓటు వేయమని ఆయుధం ఇస్తే దెబ్బ తీయకుండా ఉంటారా, ఇదీ టీడీపీ సర్కార్ వణుకుతున్న సందర్బం


కీలక ప్రాంతాల్లోనే :


ఎమ్మెల్సీ ఎన్నికలు ఉభయగోదావరి జిల్లాల్లో - కృష్ణా - గుంటూరు - శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం జిల్లాల్లో జరుగుతున్నాయి. పట్టభద్రులకు జరగబోయే ఎన్నికలో ఉభయగోదావరి జిల్లాలు - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ఓటర్లు పాల్గొంటారు. ఇక ఉపాధ్యాయ కోటాలో జరిగే ఎన్నికలో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ఓటర్లు పాల్గొంటారు. దాంతో మొత్తం పదమూడు జిల్లాల ఏపీలో ఏడు జిల్లాల ఓటర్ల మనోగతం తేటతెల్లమవుతుందన్న మాట. ఇది ఏ పెద్ద సర్వే సంస్తకూ తీసిపోని విధంగా వాస్తవ ఫలితమూ చెబుతుంది . మరి ఇదే పసుపు శిబిరాన్ని కలవరపెడుతోంది


మరింత సమాచారం తెలుసుకోండి: