ఇండోనేసియాను భూకంపం వణికించింది. సులావేసి దీవిలో శుక్రవారం సంభవించిన ప్రకంపనలకు పలు ఇళ్లు కూలిపోగా, ఒకరు చనిపోయినట్లు తెలిసింది. రిక్టర్‌ స్కేలుపై 7.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంప కేంద్రం సులావేసి పట్టణానికి సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.  మొదటిసారి భూ ప్రకంపనలు వచ్చిన ప్రాంతంలోనే 7.5 తీవ్రతతో మరోసారి భూమి కంపించడంతో ప్రభావం ఎక్కువగా ఉంది. మెటియోరాలజీ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సులవేసి పశ్చిమ, మధ్య ప్రాంత ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. సునామీ అలలకు భయపడి స్థానికులు ఎత్తయిన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు.

ఇండొనేషియా సునామీ

భూకంప కేంద్రానికి చాలా దూరంలో ఉన్న ప్రజలు ప్రకంపనలు తమ నివాసాల్లోనూ వచ్చినట్లు తెలిపారు. భూకంపం ధాటికి పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. సులవేసిలో భారీగా ప్రాణనష్టం సంభవించిందని ఆదేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. భూకంపం, స్వల్ప సునామీ ధాటికి 48కి పైగా మృతిచెందినట్లు వెల్లడించింది. పాలూ నగరంలో మరో 356 మంది తీవ్రగాయపడ్డారని వారంతా చికిత్స పొందుతున్నారని చెప్పింది. చాలా మృతదేహాలను సులవేసి సముద్రతీరంలో గుర్తించినట్లు ఏజెన్సీ అధికార ప్రతినిధి వివరించారు.  

ఇండొనేషియా సునామీ

సహాయక చర్యలు కనొసాగుతుండగానే మరోసారి భూకంపం రావడంతో ప్రజలు భయాంళనకు గురయ్యారు. డోంగాల పట్టణానికి ఈశాన్యంలో 56 కి.మీ. దూరంలో, 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.  సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోలో జనం భయానకంగా అరుస్తూ పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. భవనాల నడుమ ఒక మసీదు కూలిపోవడం కనిపించింది. సునామీ పాలూ ప్రాంతాన్ని డీకొంటున్న దృశ్యాలు ఆందోళనకరంగా ఉన్నాయి. సముద్రం మీంచి దూసుకొచ్చిన అలలు భవనాల్లోకి వచ్చాయి.

magnitude 7.5 earthquake shakes indonesia, tsunami alert issued

భూకంప కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మసీదు సునామీ తాకిడికి ఒరిగిపోయింది.  2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన తీవ్ర భూకంపంతో వచ్చిన భారీ సునామీ వల్ల హిందూ మహా సముద్రం పరిధిలో 2,26,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఒక్క ఇండొనేషియాలోనే 1,20,000 మందికి పైగా చనిపోయారు.పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా ఉన్న ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి.


గత జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన భూకంపాల కారణంగా లోంబోక్ దీవిలో 500 మందికి పైగా మరణించారు. సులవేసికి ఈ దీవి వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఏజెన్సీ హెడ్ ముహమ్మద్ సుగీ తెలిపారు. స్థానిక సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలోనే మృతిచెందినట్లు ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: