రేవంత్ రెడ్డి మీద జరుగుతున్న ఐటీ దాడులు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ని ఆత్మ రక్షణ లో పడేశాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి నిజానికి ఐటీ దాడులు జరిగితే ఇప్పుడున్న ప్రతి రాజకీయ నాయకుడు అడ్డంగా బుక్ అవుతాడు. ఐటి, ఈడీ ఇలాంటి సంస్థలు తలుచుకుంటే దొరకని రాజకీయ నాయకులు వన్ పర్సంట్ మాత్రమే వుంటారు. ఐటి. ఈడీ రేవంత్ రెడ్డి మీద దాడి చేసినట్లు చేస్తే, ఆంధ్రలో ఇప్పుడు అధికార పక్షంలో వున్న బడా నాయకుల్లో 99 శాతం మంది అడ్డంగా బుక్ అయిపోతారు.

Image result for revanth reddy

అదే విధంగా తెలంగాణలో కూడా. ముఖ్యంగా తెలంగాణలో భూముల లావాదేవీలు ఎక్కువ. అవన్నీ కూడా బినామీలు, కొనే రేటు వేరు, అమ్మే రేటు వేరు లాంటి వ్యవహారాలతో కూడినవే. కేసిఆర్ కోసం కావచ్చు, కాంగ్రెస్ తెలంగాణలో బలోపేత కాకూడదని కావచ్చు భాజాపా పనే ఈ దాడులు జరుగుతున్నాయని జనం అనుమానిస్తున్నారు. అది సహజం. ఎందుకంటే ఓటుకు నోటు కేసును ఇప్పటికి అనేక సార్లు నిద్రలేపి, అనేక సార్లు జోలపాడి పడుకోపెట్టారు.

రేవంత్ పై దాడులు..వార్నింగ్ టు....?

నిజానికి ఆ కేసును అప్పుడే, నాన్ స్టాప్ గా దర్యాప్తు చేసి, నిగ్గు తేల్చాలి. మరే ఇతర కేసు అయినా దర్యాప్తు సంస్థలు అలాగే చేస్తాయి. కానీ ఈ కేసులో మాత్రం అలా జరగలేదు.  సరే, రేవంత్ రెడ్డి సంగతి పక్కన పెడితే, అసలు ఇండైరెక్ట్ గా ఈ ఉదంతం అటు ఆంధ్రలో రాజకీయ నాయకులకు, ఓటుకు నోటు కేసుతో పరోక్ష లింక్ వున్న చంద్రబాబు కూడా కూడా ఓ హెచ్చరిక అనుకోవాలి. రేపు ఎప్పుడయినా, ఏదయినా జరగొచ్చు అనే సంకేతాలు ఈ విధంగా బయటకు వచ్చాయని అనుకోవాలి. సడెన్ గా ఈడీ లేదా ఐటి ఆంధ్రలోని ఎవరైనా రాజకీయ ప్రముఖుడి ఇంటి మీదకు వెళ్తే పరిస్థితి ఏమిటి? గత నాలుగేళ్లలో ఆంధ్రలో రాజకీయ నాయకుల సంపాదన ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని వదంతులు అయితే వున్నాయి. ముఖ్యంగా భూముల లావాదేవీలు, ఇసుక అమ్మకాలు, బినామీ కాంట్రాక్టులు. ఇవన్నీ నల్ల ధనాన్ని ఇతోధికంగా పెంచేవే. అందువల్ల ఇప్పుడు భాజపా విషయంలో చిన్న భయం అయితే పట్టుకుంటుంది. అందులో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: