జియో  నెట్ వర్క్ నిజానికి భారత దేశ టెలికాం గమనాన్ని దశ దిశ ను మార్చేసిందని చెప్పాలి. అయితే ఇకపై అన్నీ ఉచితం ఉండకపోవచ్చు. దశలవారీగా ఛార్జీలు విధించడానికి సిద్ధమౌతోంది జియో. రిలయన్స్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, త్వరలోనే జియో సేవల్లో చార్జీల మోత మోగనుంది. అయితే ఒకేసారి కాకుండా దశలవారీగా ఈ మోత మోగించాలని ఫిక్స్ అయిందట జియో. ఇందులో భాగంగా ముందుగా ఉచిత యాప్స్ పై కన్నేసింది ఈ సంస్థ. 

Image result for jio

ప్రస్తుతం జియో వినియోగదారులంతా జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందుతున్నారు. త్వరలోనే సబ్ స్క్రిప్షన్ చార్జీలు విధించాలని జియో భావిస్తోంది. నిర్దేశిత మొత్తం చెల్లిస్తేనే జియో ప్లే, జియో మూవీస్, జియో ఛాట్, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్ లాంటి సర్వీసులు లభిస్తాయి. డబ్బు చెల్లించకపోతే అవన్నీ కట్ అవుతాయి. ఇలా జియో ప్రైమ్ మెంబర్ షిప్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత 4జీ వరకు కనీస రుసుములు విధించాలని జియో భావిస్తోందట. ఉచిత కాల్స్, ఉచిత మెసెజీల జోలికి మాత్రం వెళ్లకూడదని ప్రాధమికంగా నిర్ణయించిందట. ఈ మేరకు బ్లూప్రింట్ కూడా రెడీ అయింది. ముకేష్ అంబానీ ఆమోదం కోసం వెయిటింగ్. 

Image result for jio

జియో ప్రారంభమై ఇప్పటికే రెండేళ్లు గడిచింది. ఈ రెండేళ్లలో అన్నీ ఫ్రీ అని చెప్పి ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి సంస్థలను బాగానే దెబ్బకొట్టింది జియో. కోట్ల సంఖ్యలో వినియోగదారుల్ని తనవైపు తిప్పుకుంది. ఉచిత 4జీ హ్యాండ్ సెట్స్ అంటూ గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మందిని కొత్త వినియోగదారులుగా చేర్చుకుంది. దీని దెబ్బకు టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. చివరికి ఐడియా-వోడాఫోన్ కూడా విలీనం అవ్వాల్సి వచ్చింది. అంతలా టెలికం రంగాన్ని తీవ్ర ప్రకంపనలకు గురిచేసిన జియో, ఇప్పుడు కనీస చార్జీల వైపు మొగ్గుచూపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: