ఆ ఇద్దరూ ఏపీ రాజకీయాల్లో కీలకమైన నాయకులే. ఎన్నికల వేళ ఇద్దరు సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. మీటింగులూ పెడుతున్నారు. పరస్పరం విమర్సలు చేసుకుంటున్నారు. చిత్రమేంటంటే ఆ విమర్శలు పూల చెండు మాదిరిగా సుతి మెత్తగా  తగిలేలా ఉంటున్నాయి. మరి దీని వెనక ఆంతర్యమేంటో..

అండగా ప్రభుత్వం :


పశ్చిమ గోదావరి జిల్లాలో ధర్మ పోరాట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ పై మాట్లాడుతూ సుతి మెత్తగా కామెంట్స్ చేశారు. పవన్ నిన్నటి వరకు మనతో ఉన్నారు. ఇపుడు బయటకు వెళ్ళారంటూనే ఆయన ప్రాణాలకు రక్షణ లేదంటున్నారు. ఎవరో చంపుతారని చెబుతున్నారు. మీకేం భయం లేదు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, మీకు తగిన రక్షణ కల్పిస్తామంటూ సాత్వికంగా మాట్లాడారు.


పవన్ పై బాబు విరుచుకుపడిన దాఖలాలు ఇంతకు ముందు కూడా ఎపుడూ లేవు జగన్ ని ఘాటుగా  పది మాటలు అంటే పవన్ ని  తమ ఇంటి నుంచి దారి తప్పి వెళ్ళిన తమ్ముడిలాగానే బాబు ట్రేట్ చేస్తూంటారు. అంటే ఆ తమ్ముడు  ఎపుడైనా గూటికి చేరేందుకు సిద్ధమన్న భావనతోనే బాబు అలా చేస్తున్నారనుకోవాలి.


హఠావో వద్దట :


ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేసింది. అదే ఏపీ ప్రజల మనో భావాలను పక్కన పెట్టి విభజన చేసింది. అంతే  ఆ పార్టీ మీద అంతెత్తున లేచిన పవన్ కాంగ్రెస్ హఠావో అంటూ జనసేన ఆవిర్భావ సభలోనే ఎలుగెత్తి గర్జించారు. ఇపుడు టీడీపీని వీడిన ఆయన యాత్రల పేరిట మీటింగులు పెడుతున్నారు. పశ్చిమ గోదావరిలో జరిగిన ఓ మీటింగులో పవన్ మాట్లాడుతున్నపుడు అభిమానులు టీడీపీ హఠావో అంటూ ప్లే కార్డులు ప్రదర్శించారు.


దానికి పవన్ రెస్పాండ్ అవుతూ హఠావో వద్దు, అధికారం నుంచి మత్రమే తొలగిద్దామని మాట్లాడారు. దీని అర్ధమేంటి అంటే ఇప్పటికీ టీడీపీపై పవన్ కి సాఫ్ట్ కార్నర్ ఉందని అనుకోవాలా. ఇలా ఒకే రోజు ఇద్దరు నాయకులు తమ మిత్రత్వం ఎక్కడా దెబ్బ తినకుండా సుతి మెత్తని కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళారంటే  ఫ్యూచర్లో మళ్ళీ కలసిపోయేందుకు వీలుగానే వ్యవహరిస్తున్నారనుకోవాలేమో



మరింత సమాచారం తెలుసుకోండి: